రకూల్ కూల్‌గా తన పని తాను చేసుకుపోతోంది. ముందు చిన్నా చితకా సినిమాలు చేసింది. తర్వాత పెద్ద సినిమాలు వాటంతట అవే వస్తున్నాయి. స్టార్లతో నటించే ఛాన్సొచ్చింది. చరణ్, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్లు తననే కోరుకున్నారు. మహేష్‌తో కొద్దిలో ఛాన్స్ మిస్సయినా చెర్రీ, ఎన్టీఆర్‌లతో సినిమాలు చేస్తోందిప్పుడు. త్వరలోనే మాస్‌రాజా రవితేజతో నటించిన కిక్2 రిలీజవుతోంది. అయితే ఈ పయనం గురించి ముచ్చటిస్తూ.. చాలా విషయాలే చెప్పింది అమ్మడు.
మోడలింగ్ తెలుసు. క్రీడలు తెలుసు. కానీ ఎప్పటికైనా కథానాయికగానే రాణించాలని అనుకున్నా. ఇక్కడికి వచ్చాక అనుకున్నట్టే బిజీ అయిపోయా. ఈ పయనం ఇలానే సాగనీయాలనిపిస్తోంది. అయితే చేసే పాత్రల్లో వైవిధ్యం లేకపోతే బోర్ కొట్టేస్తుంది. ఏ రంగంలో అయినా ఒకే తరహాలో కొనసాగితే బోర్ కొట్టేయడం కామన్. కానీ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్లాన్ చేసుకుంటే బోర్ అన్న పదానికే దూరంగా వెళ్లొచ్చు అంటోంది రకుల్.
అదృష్టం కొద్దీ ఇక్కడ నాకు ప్రతి సినిమా కొత్త అనుభవాన్నిస్తోంది. ప్రతి పాత్రలో కొత్తదనం దొరుకుతోంది. అందుకే ఈ పయనాన్ని ఇలా సాగనిస్తున్నా.. అని చెప్పింది. ఎప్పుడూ ఒకే తరహా పాత్రల్లో నటిస్తే నాపై నాకే విసుగొస్తుంది. అలాంటప్పుడు ప్రేక్షకులు సైతం నన్ను అలానే ఎందుకు చూస్తారు? అని తెలివైన ప్రశ్నను ఎదుటివారిపై సంధించింది. దటీజ్ రకూల్!