టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మాంచి జోష్ చూపించేస్తోంది. రీసెంట్ గా రామ్ చరణ్ తేజ్ తో భారీ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. మరో మెగా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. సాయిధరం తేజ్ తో కలిసి విన్నర్ అంటూ.. ఈ నెల 24నుంచి థియేటర్లలో సందడి చేయనుంది రకుల్.
ఇప్పుడీ విన్నర్ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటోంది రకుల్. కానీ ఈ బ్యూటీ తన స్టైలింగ్ విషయంలో మార్పు చూపించేస్తోంది. విన్నర్ మూవీలో బోలెడన్ని అందాలు కురిపించి.. ఫుల్ డోస్ ఇచ్చేసిందనే విషయం.. పోస్టర్లను టీజర్లను చూస్తే అర్ధమైపోతోంది. కాని.. ప్రమోషన్లలో మాత్రం ఎక్స్ పోజింగ్ డోస్ బాగా తగ్గించింది. పిసరంత కూడా గ్లామర్ చూపించకుండా పద్ధతిగా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటోంది రకుల్ ప్రీత్ సింగ్. కొత్త కొత్త స్టైలింగ్ ఆకట్టుకుంటోంది కానీ.. గ్లామర్ ప్రియులు మాత్రం అమ్మడిలో మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు.
సహజంగా సినిమా ప్రమోషన్లలో కూడా హాటుగా కనిపించేది రకుల్ ప్రీత్. కానీ ఇప్పుడు మాత్రం బాగా ఛేంజ్ చూపిస్తోంది. మరి అప్పుడంటే స్టార్ హీరోయిన్ రేస్ లోకి ఎంటర్ అయ్యే టైం కాబట్టి.. గ్లామర్ వల విసిరేది. ఇప్పుడు ఆ రేస్ లోకి వచ్చేసిందిగా.. అందుకే ఎక్కడ చూపించాలో.. ఎక్కడ తగ్గించాలో బాగానే వంట బట్టించుకున్నట్లుగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/