ఫోటో స్టోరి: రకుల్ జాతర బ్రాబోయ్

Update: 2018-02-12 04:38 GMT

సాధారణంగా ఏదన్నా మ్యాగజైన్ కు ఒక ఫోటో షూట్ చేస్తే.. సదరు ఫోటోలన్నీ ఒకేసారి కట్టకట్టుకుని రిలీజ్ అయిపోతాయి. కాని తన కొత్త హిందీ సినిమా కాస్త పోస్ట పోన్ అవ్వుతుండటంతో.. అమ్మడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా రోజుకో ఫోటో అంటూ గ్లామర్ లవ్వర్లను తెగ ఊరిస్తోంది. గ్లామర్ అంటే ఇది అని మిగతా హీరోయిన్లు అసూయపడేలా ఆమె ఫోజులు ఇప్పుడు ప్రకంపనాలు రేపుతున్నాయి.

తొలుత ఈ షూట్ కేవలం 'అయ్యారి' సినిమాను కాస్త గట్టిగా ప్రమోట్ చేయడం వాడుకుంటుందిలే అనుకున్నారు జనాలు. అందుకే మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం ఆమె తెల్లటి బికినీలో ఇచ్చిన ఫోజు అంతటా వైరల్ అయిపోయింది. ఆ తరువాత కేవలం బికినీల షూటే అనుకుంటే.. అమ్మడు మాత్రం ఒక స్పోర్ట్స్ బ్రా లో కనిపించి ఇంకా రచ్చ చేసింది. తరువాత ఒక అండర్ వేర్ లో కూడా మెరసింది. ఆ ఫోటో అయితే సెక్సీ అనే పదానికి కొత్త అర్ధం తరహాలో ఉంది. అక్కడితో ఈ ఫోటో షూట్ కథ ముగిసింది అనుకుంటే.. ఇప్పుడు లేస్ తో డిజైన్ చేసిన బ్రా లో అమ్మడు మరో ఫోజును ఇచ్చిన ఫోటో ఒకటి రిలీజ్ చేశారు. అసలు ఒక్క షూట్లో ఇన్నేసి అందాల జాతర అంటే.. తట్టుకోవడం కష్టమే సుమీ.

మరి తెలుగులో గ్లామర్ పాత్రలే వస్తున్నాయి కాబట్టి నేను పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటూ తన్న సన్నిహితులతో చెబుతున్న రకుల్.. ఇప్పుడు హిందీలో ఈ షూట్ తరువాత ఎటువంటి సినిమాలు చేస్తుందంటారు? వెయిట్ అండ్ సి.
Tags:    

Similar News