సినిమా పరిశ్రమతో మొదలై మెల్లగా ఒక్కో రంగానికి పాకుతున్న మీటూ సెగల తాలుకు ప్రకంపనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఫైనల్ గా దీనికి పరిష్కారం దొరుకుతుందో లేదో కాని ప్రస్తుతానికి అయితే ఇదో మంచి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మలయాళం నటుడు దిలీప్ విషయంలో ఒక మహిళా జర్నలిస్ట్ చేసిన ట్వీట్ కొత్త వివాదానికి దారి తీసింది.
ఇటీవలే ఓ బిడ్డకు తండ్రైన దిలీప్ కు విషెస్ చెబుతూ భార్య భర్తలను పొగుడుతూ సదరు లేడీ జర్నలిస్టు ట్వీట్ చేసింది. దిలీప్ గురించి తెలుసుగా. ఏడాది క్రితం మలయాళ సినిమా పరిశ్రమను కుదిపేసిన హీరొయిన్ భావన కిడ్నాప్ కేసుతో పాటు ఇతని మీద పలు లైంగిక ఆరోపణలు ఉన్నాయి. కొన్ని బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఇటీవలే అమ్మ సంఘానికి రాజీనామా చేసాడు. మోహన్ లాల్ కాపాడే ప్రయత్నం చేసారని ఇప్పటికీ మీడియా టాక్ ఉంది. అలాంటి దిలీప్ కు ఒక మహిళ ఇలా ట్వీట్ చేయడం పట్ల మన హీరొయిన్లకు బాగా కోపం వచ్చింది.
ముందుగా స్పందించిన తాప్సి సదరు జర్నలిస్ట్ ఇలా చేయటం పట్ల ప్రశ్నించింది. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్-శ్రియ.మంచు లక్ష్మి ఒక్కొక్కరుగా వచ్చి ఇదేంటని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో డిఫెన్స్ లో పడిన ఆ జర్నలిస్ట్ జస్ట్ స్నేహపూర్వకంగానే మెసేజ్ పెట్టాను తప్ప ఇంకే ఉద్దేశం లేదని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. నిజానికి ఆమె చేసింది ఒప్పు అనడానికి లేదు.
ఇదే దిలీప్ వ్యవహారమై ఇప్పటికే అమ్మ సంఘం నుంచి ఎందరో నటీమణులు సభ్యత్వం వదులుకున్నారు. ఇది తీవ్రంగా ముదరడం వల్లే దిలీప్ చివరికి రాజీనామా ఇచ్చాడు. అలాంటప్పుడు మీ టూ ఉద్యమం ఇంత తీవ్రంగా ఉన్న తరుణంలో పనిగట్టుకుని మరీ విషెస్ చెప్పడం అంటే నిప్పులో నెయ్యి పోసినట్టే. మొత్తానికి మహిళా ఒక తాటిపైకి తీసుకొస్తున్న మీ టూ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని పరిశ్రమ పెద్దలు కోరుతున్నారు.