రకుల్ బుట్టలో మరో హిందీ సినిమా

Update: 2018-11-14 12:46 GMT
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కాస్త సినిమాలు తగ్గించిందిగానీ తమిళంలో మాత్రం జోరుగానే సినిమాలు చేస్తూ ఉంది.  ఇక హిందీలో కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే 'యారియాన్'.. 'అయ్యారీ' అనే రెండు బాలీవుడ్ చిత్రాలలో నటించిన రకుల్ ప్రస్తుతం 'దిల్ దే ప్యార్ దే' అనే సినిమాలో నటిస్తోంది.  ఇక తాజాగా రకుల్ కి మరో ఆఫర్ కూడా వచ్చిందట.

దీంతో థ్రిల్ అయిన రకుల్ ట్విట్టర్ ద్వారా తన నెక్స్ట్ సినిమాను ప్రకటించింది "నా నెక్స్ట్ హిందీ సినిమా 'మర్జావా' ను ప్రకటించేందుకు సూపర్ హ్యపీగా ఉన్నాను.  మిలాప్ జవేరి మనం సత్తా చాటుదాం" అని ట్వీట్ చేసింది.  ఇక ఈ ట్వీట్ కు స్పందించిన డైరెక్టర్ మిలాప్ జవేరి "బ్యూటిఫుల్.. టాలెంటెడ్ రకుల్ ప్రీత్ ను 'మర్జావా' కు ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది.  డైలాగులు.. ధమాకా రెడీ అవుతోంది" అని రిప్లై ఇచ్చాడు.  

ఏదేమైనా రకుల్ స్లోగా బాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ అక్కడ హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తోంది.  ఈ 'మర్జావా' లో సుశాంత్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు.  రితేష్ దేశ్ ముఖ్.. తారా సుతారియాలు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ మిలాప్ జవేరి గతంలో 'మస్తిజాదే'.. 'సత్యమేవ జయతే' లాంటి సినిమాకు దర్శకత్వం వహించాడు.  
Tags:    

Similar News