ఒకప్పుడు హీరోలు మరియు హీరోయిన్స్ కేవలం నటించడంకే పరిమితం అయ్యేవారు. కొద్ది మంది మాత్రం నిర్మాణం మరియు దర్శకత్వం చేసేవారు. కాని ఇప్పుడు హీరోలు మరియు హీరోయిన్స్ తమకు దక్కిన స్టార్ డమ్ తో నాలుగు చేతుల సంపాదించేస్తున్నారు. ఎంతో మంది హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. కొందరు తమ బ్రాండ్ ఇమేజ్ ను ఉపయోగించి బిజినెస్ లో అడుగు పెట్టి అక్కడ విజయాలను సొంతం చేసుకున్నారు. ఎంతో మంది హీరోయిన్స్ కొత్త కొత్త డబ్బు సంపాదన మార్గాల్లో వెళ్తున్నారు. సౌత్ హీరోయిన్స్ లో తెలివైన హీరోయిన్ ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె పలు రంగాల్లో తన గ్లామర్ ను మరియు ఇమేజ్ ను పెట్టుబడిగా పెట్టి మంచి వ్యాపారాలను నిర్వహించింది.
ముఖ్యంగా ఆమె నిర్వహిస్తున్న జిమ్ బిజినెస్ కు మంచి స్పందన వచ్చింది. ఆమె సోదరుడితో కలిసి నిర్వహిస్తున్న బిజినెస్ లు ప్రతి ఒక్కటి కూడా మంచి సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా స్టార్టప్ ను మొదలు పెట్టింది. స్టారింగ్ యూ అనే వెబ్ సైట్ ను ప్రారంభించిన రకుల్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకునే వారికి మద్య వర్తిగా ఉంటుంది. స్టారింగ్ యూ వెబ్ సైట్ కు పలు నిర్మాణ రంగ సంస్థలు మరియు ప్రముఖులతో ఒప్పందం ఉంటుంది. నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు కావాలి అనుకునే వారు ఈ వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు ఆ వెబ్ సైట్ లో తమ పేరును నమోదు చేసుకోవడం ద్వారా కొత్తగా ఎవరైనా నటీ నటుల కోసం వెదుకుతూ ఉంటే వారికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకునే వారికి మరియు నిర్మాణ సంస్థలకు మద్య వారధిగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించిన ఈ వెబ్ సైట్ ఉంటుందని అంటున్నారు. ఈ ఐడియా ఆమెకు ఆదాయాన్ని తెచ్చి పెట్టడమే కాకుండా ఎంతో మంది ఔత్సాహికులకు మంచి అవకాశంగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. పలువురు సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలు ఆమె బిజినెస్ సక్సెస్ అవ్వడానికి దోహద పడుతాయి అనడంలో సందేహం లేదు. నిర్మాణ సంస్థలు కూడా కొత్త వారి కోసం గాలించే అవకాశం లేకుండా ఈ వెబ్ సైట్ కు వెళ్తే ఈజీగా పని అయిపోతుంది. అందుకే ఈ ఐడియా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.