అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా బన్నీ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టి వంద కోట్ల క్లబ్ లో చేర్చిన ఘనత దక్కించుకున్న విషయం తెల్సిందే. అందుకే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వెంటనే రెండో సినిమాను చేయాలని బన్నీ భావించాడట.
బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో అల్లు అర్జున్ కాస్త వెనుకంజ వేశాడు అనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ లోపు బాలయ్య తో అఖండ సినిమా ను బోయపాటి ప్లాన్ చేశాడు. భారీ విజయాన్ని అఖండ సినిమా తో బోయపాటి దక్కించుకున్న నేపథ్యంలో రామ్ తో సినిమాను చేసేందుకు సిద్ధం అయిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక హై ఓల్టేజ్ మూవీ రూపొందుతోంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు మీడియా లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా లో బాలకృష్ణ ముఖ్యమైన గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఇప్పుడు ఈ సినిమా కథ ను మొదట దర్శకుడు బోయపాటి శ్రీను మెగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు వినిపించాడు అంటూ ప్రచారం జరుగుతోంది. బన్నీ కూడా ఈ కథకు ఓకే చెప్పాడు కానీ పుష్ప తో పాటు ఆ తర్వాత చాలా కమిట్మెంట్స్ ఉండటం వల్ల డేట్లు ఇవ్వడం ఆలస్యం అవుతుందని చెప్పడంతో బోయపాటి ఈ సినిమా ను రామ్ తో చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
కథ విషయం ఏమో కాని ఈ సినిమా సక్సెస్ రామ్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా పై చాలా నమ్మకంతో బోయపాటి శ్రీను ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.