హిట్ కొట్టేందుకు కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టడం కామనే. కానీ రామ్ చరణ్ మరో అడుగు ముందుకు వేశాడు. స్టోరీ కోసమే ఐదున్నర కోట్లు పెట్టించేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ లో లిమిట్స్ పెట్టుకోకపోవడం స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తోంది కానీ.. కథ కోసం ఇంత మొత్తం ఇవ్వడం చెల్లించుకోవడం ఇదే మొదలు. ఓ నెల రోజులుగా తమిళ బ్లాక్ బస్టర్ తనీ ఒరువన్ ని.. తెలుగు రీమేక్ పై మాటలు నడుస్తూనే ఉన్నాయి. చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. నిర్మాత ఎన్వీ ప్రసాద్ క్రేజీ ప్రైస్ ఇచ్చి మరీ రైట్స్ కొనేశాడు.
తనీ ఒరువన్ తమిళ నిర్మాతలకు అక్షరాలా ఐదున్నర కోట్ల రూపాయలు చెల్లించుకున్నారని తెలుస్తోంది. పర్ ఫెక్ట్ స్క్రిప్ట్ - ఎక్కడా ప్లస్ లు - మైనస్ లు చేయాల్సిన అవసరం లేకపోవడం, సెట్స్ కి వెళ్లే సిద్ధంగా స్క్రిప్ట్ కావడంతో.. గట్టిగానే పట్టుబట్టారట రైట్స్ విషయంలో. అయినా సరే మెగాపవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి.. ఎన్వీ ప్రసాద్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. తనీ ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజానే తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. నవంబర్ మధ్యలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే యోచనలో ఉన్నాడు చెర్రీ. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ అని చెప్పుకుంటున్నారు. ప్రాజెక్ట్ కోసం అన్నీ కన్ఫాం అయిపోగా.. జస్ట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒకటే పెండింగ్ ఇక.
మరోవైపు దసరాకి రిలీజ్ చేసేందుకు బ్రూస్ లీని సూపర్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నాడు, చేయిస్తున్నాడు చరణ్. శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న బ్రూస్ లీ.. ది ఫైటర్ రిలీజ్ పై ఎవరికైనా అనుమానాలు ఉంటే.. వాటికి క్లారిటీ ఇచ్చేందుకు యూనిట్ తో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా చేయించాడు. ఇదే స్పీడ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ లోనూ కనిపించే ఛాన్సులున్నాయని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ లో.