మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అసలు సిసలైన వారసుడు రామ్ చరణ్.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ హీరో అఖిల్. వీళ్లిద్దరూ ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకే జనరేషన్ కి చెందిన స్టార్ హీరోల పిల్లలు కావడంతో.. సహజంగానే సాన్నిహిత్యం ఎక్కువ. ఇక వీళ్లిద్దరూ కలిసి అన్ స్క్రీన్ పై అయితే కనిపించలేదు కానీ.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మహా సందడి చేసేస్తుంటారు.
రీసెంట్ గా నిర్మాత డీవీవీ దానయ్య కూతురు జాహ్నవి పెళ్లి వేడుక జరిగింది. ఆ కార్యక్రమానికి చరణ్.. అఖిల్ లు కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. టాలీవుడ్లో రెండు వంశాలకు చెందిన వారసులు.. ఇలా ఒకేసారి కనిపించడం.. అంత సన్నిహితంగా మెలగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫంక్షన్ అనే కాదు.. థర్డ్ పర్సన్స్ ఫంక్షన్స్ కి ఇలాగే వెళ్లిపోతున్నారు అఖిల్.. చరణ్ లు.
కొన్ని రోజుల క్రితం సురేందర్ రెడ్డి కొడుకు అయాన్ష్ బర్త్ డే పార్టీకి ఇలాగే వచ్చాడు అఖిల్. ఇప్పుడు నిర్మా ఇంట్లో పెళ్లికి కడా ఇలాగే హాజరయ్యారు. అంతకు ముందు అనసూయతో డేటింగ్ అనే ఓ కార్యక్రమంలో అయితే.. తమ మధ్య ఎంతటి ఫ్రెండ్షిప్ ఉందో చెప్పాడు అఖిల్. మొత్తానికి ఫ్రెండ్స్ అని అనకోవడమే కాదు.. అంటే ఎలా ఉంటారో ఈ ఇద్దరు వారసులు చూపించేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు.. రామ్ చరణ్ లు హగ్ చేసుకోవడం బాగా ఆసక్తిని కలిగించింది. రేపు మెగా బర్త్ డే జరగనున్న సమయంలో.. ఈ హగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతేడా మెగా బాష్ కి రామ్ చరణ్ పిలవలేదనే కారణంతోనే దాసరి రాలేదని అంటారు. ఇప్పుడు దాసరి విబేధాలు కూడా తొలగిపోతే.. చరణ్ ని ఇండస్ట్రీలో అజాత శతృవు అనేయచ్చు.