మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. కోలీవుడ్ మూవీ కత్తిని.. చిరంజీవి కోసం ఆయన ఇమేజ్ కి తగినట్లుగా బోలెడన్ని మార్పులు చేశాడు దర్శకుడు వివి వినాయక్. ప్రస్తుతానికి కత్తిలాంటోడు అనే టైటిల్ ను అనుకుంటుండగా.. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. నయనతార - అనుష్కల్లో ఒకరిని హీరోయిన్ గా తీసుకుంటారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు రెజీనాతో ఓ ఐటెం సాంగ్ చేయించనున్నారని అంటున్నారు.
ఇప్పుడీ మెగా 150లో మరో మెగా హీరోతో కేమియో రోల్ చేయించే ఛాన్సులున్నాయని తెలుస్తోంది. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ మూవీలో.. చెర్రీ ఓ కేమియో చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తో సడెన్ ఎంట్రీ ఇప్పించి స్టోరీని మలుపు తిప్పేలా రాసుకున్నాడట వినాయక్. మరోవైపు.. మెగాస్టార్ 150లో కేమియో చేయాల్సిందిగా తనకు ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానని, ఈ ల్యాండ్ మార్క్ మూవీలో చిన్న రోల్ అయినా చేయాలని ఉందని అల్లు అర్జున్ ఇప్పటికే చెప్పేశాడు.
ఫ్యాన్స్ కు సడెన్ సర్ ప్రైజులు చాలానే ఇచ్చేలా సినిమాని ప్లాన్ చేశాడట దర్శకుడు వివి వినాయక్. ఇలా వినిపిస్తున్నవే కాకుండా.. మరెన్నో థ్రిల్స్ మూవీలో ఉంటాయని వినాయక్ సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి కత్తిలాంటోడు కోసం వినాయక్ బాగానే స్కెచ్ లు వేశాడని అర్ధమవుతోంది. .