చరణ్‌ అండ్ అల్లూస్‌.. ఆల్ ఓకె??

Update: 2016-05-26 04:42 GMT
చెప్పను బ్రదర్‌ కాంట్రోవర్శీ తరువాత అల్లు అర్జున్ మెగా క్యాంపులో మోస్టు పాపులర్‌ నటుడు అయిపోయాడు. అదంతా ఏమో గాని.. మనోడు చెప్పాల్సినివి ఇంకా చాలానే ఉన్నాయి బ్రదర్‌ అంటున్నారు విమర్శకులు. ఎందుకంటే ఇప్పుడు పైకి కనిపించని కోల్డ్ వార్‌ ఒకటి చరణ్‌ అండ్‌ అల్లూ ఫ్యామిలీ మధ్యన నడుస్తోంది అనేది ఓ టాక్‌.

అవును.. మొన్న 'ఒక మనసు' ఆడియో లాంచ్‌ కు.. బన్నీ వెళిపోయాక చరణ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఏదో యాక్సిడెంటల్‌ గా అలా జరిగిందా.. లేకపోతే వాంటెడ్‌ గా ఇలా ప్లాన్‌ చేశారా అనేది మాత్రం ఎవ్వరికీ అర్దం కాలేదు. ఇప్పుడు న్యూస్ ఏంటంటే.. అసలు అల్లు అరవింద్‌ తీస్తున్న 'తని ఒరువన్' రీమేక్‌ కు కనీసం ఒక్క షెడ్యూల్ లో కూడా చెర్రీ పాల్గొన్నదే లేదు. ఎప్పటికప్పుడు సాకులు చెప్పి ఈ సినిమా షూటింగ్‌ నుండి తప్పించుకుని తిరుగుతున్నాడట. చూస్తుంటే ఇదేదో కావాలని చేస్తున్నట్లు లేదు?

పైగా బ్రూస్‌ లీ సినిమాలో ఉన్న ఫిజిక్‌ మనోడికి పోలీస్ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ చేయడానికి పక్కాగా సరిపోతుంది. అయినాసరే డైటింగ్‌ అండ్‌ బాడీ బాల్టింగ్‌ అంటూ టైమ్‌ వేస్టు చేయడం ఏంటో చరణ్‌కే తెలియాలి. ఒకవేళ ఏదైనా కలహం కారణంగా ఇలా డీలే చేస్తున్నాడేమో అల్లూ వారికే తెలియాలి. ఫ్యాన్స్ కు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి బ్రదర్‌.
Tags:    

Similar News