కొన్ని పరిస్థితుల వల్ల పండగలని ఎవరైనా మిస్ అవుతారెమో గాని మన స్టార్ హీరోలు మాత్రం అస్సలు మిస్ అవ్వరు. ఎదో ఒక వార్తను చెప్పి అభిమానులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంటారు. రిలీజ్ కాబోయే సినిమాలకు సంభవించిన ఎదో ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడం కామన్. ఇక ఈ ఉగాదిని ఇద్దరు హీరోలు ఛాయా స్పెషల్ గా టార్గెట్ చేశారు. వారెవరో కాదు ఒకరు సూపర్ స్టార్ మరొకరు మెగా పవర్ స్టార్.
మహేష్ రామ్ చరణ్ సినిమాలు ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ముందుగా చరణ్ రంగస్థలం సినిమా మార్చ్ 30న రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ చూస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఉగాది కానుకగా మార్చ్ 18న సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రామ్ చరణ్ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నాడట.
మెగా స్టార్ చిరంజీవి వేడుకలో స్పెషల్ గెస్ట్ అని తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. అయితే ఉగాదికి అభిమానుల కోసం మహేష్ ఒక స్పెషల్ ఇవ్వబోతున్నాడట. స్పెషల్ గా టీజర్ ని ఉగాది కానుకగా రిలీజ్ చేయాలనీ దర్శకుడు కొరటాలతో చర్చలు జరుపుతున్నాడు. దీంతో దర్శకుడు టీజర్ పై స్పెషల్ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విధంగా అభిమానుల ఆనందం కోసం సూపర్ స్టార్ - మెగా పవర్ స్టార్ ప్లాన్స్ వేస్తున్నారన్నమాట. అది మ్యాటర్.