చెర్రీ-ఎన్టీఆర్.. 45 రోజుల ట్రైనింగ్

Update: 2018-02-20 16:32 GMT
టాలీవుడ్ ప్రేక్షకులు బాహుబలి కోసం ఎంతగా ఎదురుచూశారో చెప్పలేము గాని అంతకంటే ఎక్కువగా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. అసలే మల్టి స్టారర్ సినిమా కావడంతో ఇద్దరు అగ్రనటులు ఎలా కనిపిస్తారో అని అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇంకా సినిమా స్టార్ట్ కాకముందే సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలుసుకోకుండా ఉండడం లేదు. ఇక మెగా నందమూరి అభిమానులు ఆనందపడేలా వస్తోన్న ఆ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ రీసెంట్ గా మరోటి అందింది.

సినిమా లో యాక్షన్ సీన్స్ ప్రధానంగా ఉంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే కొన్ని ప్రయోగాత్మకమైన సన్నివేశాలు కూడా ఉంటాయట. స్క్రిప్ట్ మొత్తం ఇంకా రెడీ అవ్వలేదు గాని రాజమౌళి విజన్ అనేది ఒకటి ఉంటుంది కదా.. ఆ ప్రకారం జక్కన్న కొన్న సీన్స్ ని ప్లాన్ చేసుకున్నాడు. అయితే కథలో ఆ సన్నివేశాలు కీలకం కావడంతో రామ్ చరణ్ తేజ్ - జూనియర్ ఎన్టీఆర్ కాల్షీట్స్ అనుకున్న సమయానికంటే కొంచెం ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే జక్కన్న ఇద్దరిని కరెక్ట్ గా ప్రిపేర్ చేయడానికి కొంత ట్రైనింగ్ ఇవ్వనున్నాడట.

తారక్ చెర్రీ ని మొత్తంగా షూటింగ్ టైమ్ లో యాక్షన్ అనగానే సీన్స్ మ్యాక్సీమమ్ సింగిల్ షాట్ లో సెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ కోసం కొన్ని టెక్నీక్స్ గురించి కూడా శిక్షణ ఇస్తారట. ఇక ఫైనల్ గా సినిమాను సెప్టెంబర్ సెకండ్ వీక్ లో స్టార్ట్ చేయాలని రాజమౌళి టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ సినిమా ఎన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
Tags:    

Similar News