చరణ్‌.. వైట్ల.. వెనక్కి ఇచ్చేస్తారా??

Update: 2015-10-19 17:30 GMT
సినిమా ఫ్లాపయ్యిదంటే చాలు హీరోలను - దర్శకులను డబ్బులు వెనక్కి ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లు అడగటం షరా మామూలు అయిపోయింది. తమిళనాట పరిస్థితి మరీ ఘోరం. అక్కడ రజనీకాంత్‌ వంటి అతి పెద్ద సూపర్‌ స్టార్‌ ను కూడా పంపిణీదారులు ఓ రేంజులో వేధించేస్తున్నారు. ఈ సమయంలో తెలుగులో కూడా ఇలాంటి సౌండులో వినిపించాయి.

ఆ మధ్యన ఆగడు సినిమా ఫ్లాపైనప్పుడు.. మా డబ్బులు మాకు కావాలి అంటూ కొందరు చిన్నగా ఏదో లేవనెత్తారు. కాకపోతే అక్కడ రంగంలో ఉంది ఈరోస్‌ వంటి పెద్ద సంస్థ కాబట్టి.. పప్పులు పెద్దగా ఉడకలేదు. ఇప్పుడికి బ్రూస్‌ లీ సిట్యుయేషన్‌ ఏంటి? 56 కోట్ల నుండి 60 కోట్ల లోపు ఈ సినిమా విక్రయాలు జరిగాయ్‌. మొత్తంగా అన్ని ఏరియాల్లోనూ అమ్మేశారు. దాదాపు ఒక 25 నుండి 30% లాస్‌ వచ్చే ఛాన్సుందని ఇప్పటికే అంచనాలున్నాయి. అలా చూస్తే.. ఈ లాస్‌ పెద్ద లాస్‌ కాదు కాని.. ఈ బిజినెస్‌ లో ఇది సహజమే కాని.. కొందరు పంపిణీదారులు మాత్రం సినిమా ఇంత దారుణంగా మోసం చేస్తుందా అంటూ ఇప్పటికే ఎద్దేవా చేస్తున్నట్లు టాక్‌.

ఈ సమయంలో రామ్‌ చరణ్‌ ఏం చేస్తాడు అనేదే అతి పెద్ద విషయం. గతంలో గోవిందుడు అందరివాడేలే టైములో నిర్మాత బండ్ల గణేష్ నష్టపోకూడదని తన రెమ్యనూరేషన్‌ లో కొంత తిరిగిచ్చేశాడు చెర్రీ. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడా? సినిమాకు చెర్రీ ఓ 10 కోట్లు.. వైట్ల ఒక 6 కోట్లు తీసుకున్నారట. వీరిద్దరూ ఏమన్నా తిరిగిచ్చి 30% పూడుస్తారా? నిజానికి ఇది వ్యాపారం కాబట్టి.. వీరు చేయాల్సిన అవసరమేమీ లేదు. కాని పంపిణీదారులు ఎవరైనా ఇష్యూ చేయాలని ఫిక్సయితే మాత్రం.. వీరు ఏదో ఒకటి చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. చూద్దాం.
Tags:    

Similar News