మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరీర్ మొదటి నుంచి ఓ లెక్క ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ఓ సినిమా మొదలుపెట్టాక మొత్తం ఆ పని పూర్తయ్యాకే ఇంకో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేవాడు. దాదాపుగా అనుకున్న టైంకే సినిమాలన్నీ కంప్లీట్ చేసేయడంతో ముందు అనుకున్న లెక్క ప్రకారమే అంతా సాగేది. కానీ లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్ దగ్గరకు వచ్చేసరికి రామ్ చరణ్ లెక్క తప్పింది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ పీరియాడికల్ ఫిలిం రంగస్థలం మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అనుకున్న దానికన్నా బాగా ఆలస్యమవుతూ వచ్చింది. మార్చి 30న సినిమా విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించేశారు. కానీ ఆ సినిమా పనులు ఇంకా కొంచెం మిగిలే ఉన్నాయి. రంగస్థలం తరవాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేయడానికి రామ్ చరణ్ ఓకే చెప్పేశాడు. బోయపాటి యమ స్పీడుగా పని మొదలెట్టేసి ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా తీసేశాడు. కానీ సుకుమార్ మాత్రం రంగస్థలానికి ఇంకా తుదిరూపు తేలేదు.
ఇటు రంగస్థలం.. అటు బోయపాటి సినిమా పనులు మాంచి బిజీలో ఉండగా రామ్ చరణ్ షూటింగులకు కాస్త గ్యాపిచ్చి భార్య ఉపాసనతో కలిసి అమెరికాకు విహారానికి వెళ్లాడు. దీంతో అతడు తిరిగొచ్చే వరకు రెండు సినిమాల పనులకు కాస్త బ్రేక్ పడినట్టే. బోయపాటి శ్రీను మూవీ షూటింగ్ కాస్త ఆలస్యమైనా వచ్చే ఇబ్బందేం లేదు. కానీ రంగస్థలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాలంటే ముందు షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి. అలాంటి తరుణంలో రామ్ చరణ్ ఫారిన్ టూర్ వెళ్లడం అభిమానులకు కాస్త అయోమయం కలిగించింది. కొంపదీసి సుకుమార్ పై ఒత్తీడి పెంచే వ్యూహమా?
ఇకపోతే మార్చి 18న ఉగాది పండుగను పురస్కరించుకుని వైజాగ్ లో రంగస్థలం ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా పిఆర్ టీమ్ దీనికి సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నట్లు భోగొట్టా!!