చరణ్‌ మూవీస్‌ లో ఇదే బ్యాడ్‌

Update: 2015-10-17 04:03 GMT
సినిమా ఎలా ఉంది అనే విషయం కంటే.. అసలు సినిమాకు ఓపెనింగ్సు చాలా బ్యాడ్‌ గా ఉన్నాయ్‌ అనే విషయం ఇప్పుడు పెద్ద హైలైట్‌ అయిపోయింది. అవును.. బ్రూస్‌ లీ గురించే.. సినిమాలో విషయం ఉందా లేదా అనే విషయం కంటే కూడా కొన్ని ఇతరత్రా కారణాలు బాగా గట్టిగా పనిచేయడంతో అసలు సినిమాకు రావల్సినంత రేంజు ఓపెనింగ్సు మాత్రం రాలేదు.

రామ్‌ చరణ్‌ లుక్‌ అదిరినా.. రకుల్‌ గ్లామర్‌ బాగున్నా.. అసలు ఆడియన్స్‌ ఇంకా 'ఆగడు' డిజాష్టర్‌ నుండి తేరుకోలేదా? శ్రీను వైట్ల తీసిన ఆ బ్యాడ్‌ మూవీని మర్చిపోలేదా? అంటే అవుననే అనుకోవాలి. అందుకే సినిమాను ఎంత ప్రమోట్‌ చేసినా కూడా బి-సి సెంటర్లలో వైట్ల ప్రభావం గట్టిగా కనిపించింది. ఇక ఇదంతా ఒకెత్తయితే.. అసలు వైట్ల సినిమా అనగానే విపరీతమైన కామెడీ కోరుకుంటారు జనాలు.. కాని ఇందులో మాత్రం అలాంటిదేమీ లేదు. హిలేరియస్‌ ఎపిసోడ్‌ ఒక్కటంటే ఒక్కటి లేదు. దానితో సినిమా చాలామంది మాసెస్‌ కు నచ్చలేదు. కోన వెంకట్‌.. గోపి మోహన్‌.. మ్యాజిక్‌ చేస్తారనుకుంటే.. పాత సినిమాల్లోని సీన్లనే తెచ్చి ఇందులో జొప్పించారు. ఇంకేముంది.. సినిమాకు అవన్నీ మూనస్సే.

ఇకపోతే ఓపెనింగ్సు పరంగా చూసుకుంటే ఒక 12 నుండి 13 కోట్ల షేర్‌ మాత్రమే బ్రూస్‌ లీ కి రానున్నట్లు ట్రేడ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.  చూస్తుంటే.. చరణ్‌ ఓపెనింగ్స్‌ అన్నింటిలోకి ఇదే బ్యాడ్‌ ఏమో అనాలి కదూ
Tags:    

Similar News