యూఎస్ ప్రీమియర్ లలో బ్రూస్ లీ ఆటలు చెల్లలేదు. చెప్పుకోదగ్గ సంఖ్యలో వేసినా.. ప్రీమియర్ షో కలెక్షన్స్ విషయంలో.. చెర్రీ లేటెస్ట్ మూవీ టాప్ ఫైవ్ లోకి కూడా ఎంటర్ కాలేకపోయింది. నిజానికి మెగాస్టార్ రీఎంట్రీ ఆధారంగా.. బాహుబలి మినహా మిగతా రికార్డులన్నీ బ్రూస్ లీ తుడిచేస్తాడనే అంచనా వేశారు. అయితే.. ప్రీమియర్ల విషయంలోనే.. యూఎస్ లో చెర్రీ వీక్ నెస్ బయటపడింది.
బ్రూస్ లీకి ప్రీమయర్ షోలతో వచ్చిన కలెక్షన్ మొత్తం 2.77 లక్షల డాలర్లు. టాలీవుడ్ మూవీస్ వరకే చూసినా.. ఇది ఏడో స్థానం మాత్రమే. బాహుబలి అందనంత ఎత్తులో ఉన్నాడు లెండి. సెకండ్ ప్లేస్ లో ఉన్న శ్రీమంతుడు 5.6 లక్షల డాలర్లు రాబట్టాడు. ఆగడు - సన్నాఫ్ సత్యమూర్తి - అత్తారింటికి దారేది - గోపాల గోపాల ఆ తరువాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయ్. శ్రీనువైట్ల కాంబినేషన్ లో రావడం ప్లస్ పాయింట్ అవుతుందని.. చెర్రీ పాత రికార్డులను దులిపేస్తాడనే అంచనాలు అందుకోలేకపోయాడు యూఎస్ లో.
అయితే.. ఈ స్పీడ్ చూస్తే మాత్రం.. తొలి వీకెండ్ లోనే వన్ మిలియన్ డాలర్స్ అందుకోవడం మాత్రం కాస్త జరిగే పనేనేమో!! ఫస్ట్ టైం ఈ ఫీట్ సాధించానన్న ఆ ఒక్క రికార్డ్ తో మరి సరిపెట్టుకుంటాడా? లేకపోతే అది కూడా కాస్త డౌటేనా? ఏంటో మరి చెర్రీ పరిస్థితి.