మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా రేసులో ఎందరు దర్శకులు ఉన్నా.. మెగా కాంపౌండ్ నమ్మకం అంతా వి.వి.వినాయక్ పైనే. అతడి కమిట్ మెంట్ - డెడికేషన్ పై చిరుకి బోలెడంత నమ్మకం. మొదటి నుంచి ల్యాండ్ మార్క్ సినిమాకి వినాయక్ దర్శకుడు అయితేనే బావుంటుందనేది అతడి ఆలోచన. దర్శకుడు ఎప్పుడూ సమస్య కాదు. కథే అసలు సమస్య. చిరుకి నచ్చే కథే రాలేదు అంతే.
అప్పట్లో తమిళ హిట్ చిత్రం కత్తి రీమేక్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనుకున్న టైమ్ లో మళ్లీ ఎందుకో వాయిదా వేశారు. రీమేక్ కి సంబంధించిన అధికారిక వార్త బైటికి రాలేదు. ఒకవేళ మనసు మార్చుకుని ఇంకా ఏవైనా కథలు వింటున్నారా? అన్న సందేహాలొచ్చాయి. కానీ ఇప్పుడు అన్నిటికీ లైన్ క్లియర్ అయ్యింది. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా డీటెయిల్స్ ని డీటెయిల్డ్ గా చెప్పుకొచ్చాడు. చిరు 150వ సినిమా కత్తి రీమేక్ అంటూ ఘంటాపథంగా చెప్పాడు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తారని చెప్పుకొచ్చాడు. బెంగళూరులో జరిగిన రిట్జ్ ఐకన్ 2015 అవార్డ్స్ కార్యక్రమంలో చరణ్ ఈ సంగతిని రివీల్ చేశాడు.
చరణ్ నేరుగా తెలుగు మీడియా ముందుకు వచ్చి అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. లేదూ డైరెక్టుగానే సినిమా ఓపెనింగ్ చేసేస్తున్నాం. లేదా చేసేశాం.. అని ఉత్తర్వులు అయినా పంపించాలి. ఏదో ఒకటి చేసేవరకూ ఏ మాటనూ తెలుగు ప్రేక్షకులు, అభిమానులు నమ్మలేని పరిస్థితి. ఏం చేస్తారో చూడాలి.