స్పాటెడ్: అమెరికాలో ధృవ టీమ్

Update: 2016-12-09 03:08 GMT
మెగా పవర్ స్టార్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తెలుగు ఆడియన్స్ చూసి ఉండకపోవడంతో.. ఫ్యాన్స్ తెగ థ్రిల్ అయిపోతున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ కంటే ఓవర్సీస్ ప్రేక్షకులు ముందే ధృవ సినిమా చూసేసి ఎంజాయ్ చేసేశారు. అది కూడా ధృవ టీంతో కలిసి మూవీ చూసే అవకాశం వాళ్లకు దక్కింది.

ఓవర్సీస్ ప్రమోషన్స్ కోసం ధృవను అక్కడ ప్రచారం చేసేందుకు.. దర్శకుడు సురేందర్ రెడ్డి.. విలన్ గా నటించిన అరవింద్ స్వామిలతో పాటు మరికొందరితో కలిసి యూఎస్ వెళ్లాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా.. యూఎస్ రోడ్లపై అంతా కలిసి కాఫీ తాగుతూ.. ఓ సెల్ఫీతో హంగామా చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సెల్ఫీ తీస్తే.. పక్కనే రామ్ చరణ్.. అరవింద్ స్వామిలు అల్ట్రా స్టైలిష్ గా పోజులు ఇచ్చారు. ఇక ధృవను బే ఏరియాతో పాటు.. మొత్తం మూడు ప్రాంతాల్లో చరణ్ అండ్ టీం ప్రీమియర్ షోలకు అటెండ్ అయ్యారు.

అన్ని చోట్లా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చరణ్ - అరవింద్ స్వామిల మధ్య క్లాష్ సందర్భంగా వచ్చే సీన్స్ కి అయితే.. దాదాపుగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేశారు యూఎస్ ఆడియన్స్. తెలుగు రాష్ట్రాల్లో అయితే.. ఇంతకు మించిన టాక్ వస్తోందని చెబుతున్నారు ట్రేడ్ జనాలు.
Tags:    

Similar News