చెర్రీ ఆ సినిమాపై మ‌న‌సుప‌డ్డాడా?!

Update: 2015-09-05 07:29 GMT
మ‌న ద‌గ్గ‌ర డ‌బ్ అయితే త‌ప్ప త‌మిళ సినిమాల గురించి మ‌న‌కు వెంట‌నే తెలియ‌దు. కానీ మ‌న క‌థానాయ‌కులు మాత్రం త‌మిళ సినిమాల్ని తెలుగు చిత్రాల‌తో స‌మానంగా ఫాలో అవుతుంటారు. అక్క‌డ ఏ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో, ఏ సినిమా ఎలా ఉందో, వాటిలో క‌థేంటో తెలుసుకొంటుంటారు. ఏమాత్రం న‌చ్చినా ఆ సినిమాల్ని రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడుతుంటారు. అఫ్‌కోర్స్‌.. తెలుగు సినిమాల‌పై తమిళ క‌థానాయ‌కుల చూపు కూడా అలాగే ఉంటుంది. ఎవ‌రికి ఏ  సినిమా న‌చ్చినా ఒక‌రికొక‌రు ఇచ్చి పుచ్చుకోవ‌డాలు జ‌రుగుతుంటాయ‌న్న‌మాట‌. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే రామ్ చ‌ర‌ణ్ ఓ త‌మిళ సినిమాపై మ‌న‌సుప‌డ్డాడు కాబ‌ట్టి. ఆ సినిమాని తాను రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు కాబ‌ట్టి!

త‌మిళ క‌థానాయ‌కుడు జ‌యం ర‌వి న‌టించిన `థాని ఒరువ‌న్‌` అనే చిత్రం ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇందులో అర‌వింద్ స్వామి ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు.  న‌య‌న‌తార క‌థానాయిక‌. ఓ పోలీసు స్టోరీతో వ‌చ్చిన ఈ చిత్రం త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించింది. జ‌యం ర‌వికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ చిత్రాన్ని చూసిన మ‌న చెర్రీ ఫిదా అయిపోయాడ‌ట‌. ఇటీవ‌లికాలంలో చ‌ర‌ణ్ కూడా పోలీసు పాత్ర‌ల్ని చేస్తున్నాడు. `తుఫాన్‌`లో పోలిసుగా క‌నిపించిన ఆయ‌న కొత్త సినిమా `బ్రూస్‌ లీ`లోనూ ఖాకీ వేశాడు. అందుకే మ‌ళ్లీ ఖాకీ క‌థ‌పై మ‌న‌సుప‌డ్డాడ‌ట‌. `థాని ఒరువ‌న్‌` రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండ‌ని తన‌తో సినిమాలు చేయాల‌నుకొంటున్న ద‌ర్శ‌కుల‌కు చ‌ర‌ణ్ చెప్పాడ‌ని స‌మాచారం. వాళ్లు ఇప్పుడు ఆ సినిమాని చూసి అభిప్రాయం చెప్పే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. అన్నీ కుదిరితే చెర్రీ పూర్తిస్థాయి పోలీసు పాత్ర‌లో మ‌రోసారి అల‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టే!
Tags:    

Similar News