#ఆచార్య.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఇదే?

Update: 2021-01-03 04:36 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సోషియో పొలిటిక‌ల్ డ్రామా `ఆచార్య‌`లో దాదాపు 40 నిమిషాల నిడివి ఉన్న ప్రత్యేక పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెర ఆద్యంతం మెరుపులు మెరిపించే పాత్ర‌లో చ‌ర‌ణ్ ఆగ్ర‌హావేశాలు హైలైట్ గా ఉంటాయంటూ ఒక‌టే ప్ర‌చారం సాగిపోతోంది. అంతా బాగానే ఉంది కానీ.. అస‌లు ఈ పాత్ర గెట‌ప్ ఎలా ఉండ‌నుంది?  కొర‌టాల ఇంకా రివీల్ చేయ‌రేం?.. కానీ ఈలోగానే ఒక ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ అంత‌ర్జాలంలో సునామీలా మారింది.

ఇదే చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ అన్నంత‌గా ఆ లుక్ ని డిజైన్ చేశారు అభిమాని.  ఇది అధికారికమైనది కాదు. కానీ అది ఏ కోణంలో చూసినా తక్కువ కాద‌ని అర్థ‌మ‌వుతోంది. అభిమాని పోస్టర్ ప్రతి బిట్ అద్భుతంగా కుదిరింది.

ఒక ర‌కంగా చ‌ర‌ణ్ ని చూస్తుంటే మెగాస్టార్ అడ‌వి దొంగ గెట‌ప్ ను కాస్త పోలి ఉంది. 90ల‌లో క్లాసిక్ `అడ‌వి దొంగ‌`లో గిర‌జాల జుత్తుతో మాటలు రాని మూగ‌వానిగా.. మోడ్ర‌న్ స‌మాజంపై దండెత్తేవాడిగా .. ఎంతో బ‌ల‌వంతుడిగా చిరంజీవి క‌నిపిస్తాడు. ఇప్పుడు చ‌ర‌ణ్ రూపం మోడ్ర‌న్ ట‌చ్ తో అలా క‌నిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న రామ్ చ‌ర‌ణ్ చాలా మోడ్ర‌న్ లుక్ తోనే క‌నిపిస్తున్నాడు. ఆ రూపాన్ని అడ‌వి దొంగ రూపాన్ని మెర్జ్ చేసి ఈ డిజైన్ రూపొందించిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

ప్రస్తుతానికి మెగా అభిమానులకు కనీసం రామ్ చరణ్ రూపాన్ని ‘ఆచార్య’ లో ఎలా ఉంటుందో ఊహించుకునేందుకు ఇది ఉప‌క‌రిస్తుంది. ఈ రూపాన్ని సృష్టించిన అభిమాని కి డిజైన్ రెడీ చేయ‌డానికి దాదాపు నాలుగు గంటలు పట్టిందట‌. త‌మ ఫేవ‌రెట్ స్టార్ కి ఏదైనా ఇవ్వాల‌న్న త‌ప‌న‌తో ఎంతో ప‌ట్టుద‌ల‌గా దీనిని రూపొందించార‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ కోవిడ్ 19 కి చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిన‌దే. అత‌డు వేగంగా కోలుకుని తిరిగి ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో జాయిన్ కావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News