ఏంటో ఒకే రోజు రెండు డిఫరెంట్ విషయాలు చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. సాధారణంగా మనోడు తన అఫీషియల్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఏదైనా చెప్పాడంటే.. అది చాలా కొత్త విషయం అయినా అయ్యుంటుంది, లేకపోతే ఎవ్వరూ ఎప్పుడూ చెప్పనిది అయినా అయ్యుంటుంది. అసలు శ్రీను వైట్ల సినిమాలో ఏం జరుగుతోంది అని అందరూ ఆలోచిస్తున్నప్పుడు.. నిన్ననే ఇంటెర్వల్ బ్లాక్ షూటింగ్ చేశాం అంటూ చెర్రీ చెప్పేస్తాడు. ఇకపోతే ఇప్పుడు హైదరాబాద్‌లోనే షూటింగ్ చేస్తున్నాడు కదా అనుకుంటే.. ఇవాళ ఓ కొత్త న్యూస్ చెప్పాడు. ఒకటి కాదు, రెండు చెప్పాడు.
ముందుగా గతంలో తనని కలసిన తన ఫ్యాన్, చిన్న బుడతడు పరశురాం ను స్కూల్లో జాయిన్ చేసినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. మనోడు ఈ రోజు ఉదయం అమరనాథ్ తీర్ధయాత్రకు వెళ్ళానని సెలవిచ్చాడు. సముద్ర మట్టం నుండి 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న అమరనాథ్‌కు వెళ్ళాలనేది చెర్రీ మథర్ సురేఖ గారి కోరికట. అందుకే ఆమెకు పుణ్యం దక్కాలను మనోడు అక్కడికి వెళ్ళి దేవుడ్ని దర్శనం చేసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు.. అసలు మన దేశంలోనే కాశ్మీర్ లోయలో ఉన్న అమరనాథ్ ప్రాంగణం.. భూతలస్వరంగం అంటూ ఆకాశానికి ఎత్తేశాడు చరణ్. నిజానికి గాల్లో ఎగిరే విమానాల బిజినెస్ చేయతలపెట్టిన చరణ్‌ను చూస్తే.. ఈ రేంజులో ఆథ్యాత్మిక యాంగిల్ ఉందని ఎవరైనా అనుకుంటారా? కాని ఆ ఫోటో చూస్తే నమ్మితీరాల్సిందే మరి. మరోమాట.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాగే పరమశివుడి భక్తుడండోయ్.