చరణ్‌ అంత పెద్ద హెల్ప్‌ చేశాడా?

Update: 2015-09-19 03:52 GMT
ఇప్పుడు ఫిలిం సర్కిల్సులో చర్చిస్తున్న అతి పెద్ద అంశం ఏంటంటే.. అసలు రామ్‌ చరణ్‌ ఎందుకు హెల్ప్‌ చేశాడూ అని.. ఇంతకీ చెర్రీ ఎందుకోసం - ఎవరి కోసం - ఏం సాయం చేశాడబ్బా? వస్తున్నాం.. అక్కడికే వస్తున్నాం.

యాక్చువల్‌ గా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్‌ తో మెగా పవర్‌ స్టార్‌ ఒక సినిమాను చేయాలి. అయితే ఆ సినిమా ఎప్పుడో మొదలు కావల్సి ఉన్నా కూడా, ఈలోపు శ్రీను వైట్లతో బ్రూస్‌ లీ మొదలెట్టేశాడు చరణ్‌. ఇక ఈ సినిమా తరువాతైనా మరి చేస్తాడో లేదో తెలియదు. ఇప్పటికే రెండు కథలు విని, ఇవి వద్దు మాష్టారూ కొత్తవి తీసుకురండి అంటూ గౌతమ్‌ కు చెప్పాడట. ఇదంతా పక్కెనెట్టేస్తే.. మొన్న రిలీజ్‌ అయిన కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ సినిమాకు ప్రొడ్యూసర్‌ గౌతమ్‌ మీననే. అయితే ఈయన్ను సినిమా నాకిచ్చేయవా గురూ అంటూ నితిన్‌ అడిగినా కూడా, అబ్బే అమ్మను అన్నాడట. ధైర్యంగా రెండేళ్ల తరువాత ఇప్పుడు రిలీజ్‌ చేస్తుంటే.. సరిగ్గా రిలీజ్‌ టైములో ఏదో ఫైనాన్సియల్‌ ట్రబుల్‌ వచ్చేసింది. మరి దానిని ఎవరు సాల్వ్‌ చేస్తారు?

ఆ సమయానికి రామ్‌ చరణ్‌ రంగంలోకి దిగి... కొంతమంది ఫైనాన్షియర్ల ద్వారా సాయం చేయించాడట. అయితే గౌతమ్‌ తో అసలు సినిమా చేస్తున్నాడో తెలియదు కాని, అంత పెద్ద హెల్స్‌ ఎందుకు చేశాడో మరి తెలియదు. ఇప్పుడు ఫిలిం నగర్‌ లో చాలామంది ఈ విషయాన్ని సోధించే పనిలో పడ్డారులేండి.
Tags:    

Similar News