చ‌ర‌ణ్ ఇంట్లో క్రికెట‌ర్లు సంద‌డి!

Update: 2022-09-26 11:30 GMT
అతిధులుగా ఆతిధ్యం ఇచ్చి..స‌న్మానించ‌డంలో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. ముఖ్యంగా సెల‌బ్రిటీల విష‌యంలో  ఎంతో ఉన్న‌తంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. హైద‌రాబాద్ కి ఎవ‌రొచ్చి నా? త‌న ఇంటికి ఆహ్వానించి వాళ్ల‌తో మాట మంతి చేస్తుంటారు. ఇటీవలే క‌మ‌ల్ హాస‌న్..స‌ల్మాన్ ఖాన్ లు చిరు ఇంట్లో ఎలాంటి సంద‌డి చేసారో చూసాం.

ఇద్ద‌ర్ని ఎంతో ఘ‌నంగా స‌త్క‌రించి కుటుంబ స‌భ్యుల్ని ప‌రిచ‌యం చేసారు. మెగాప‌వ‌ర్ స్టార్  రామ చ‌ర‌ణ్ కూడా తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి  పుచ్చుకున్న‌ట్లే క‌నిపిస్తుంది. ఆస్ర్టేలియాతో మ్యాచ్ సంద‌ర్భంగా నిన్న‌టి రోజున భార‌త క్రికెట‌ర్లు హైద‌రాబాద్ లో హ‌ల్చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ క్రికెట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విందు ఏర్పాటు చేసారు.

మ్యాచ్ లో విజ‌యం సాధించిన అంనంత‌రం హార్దిక్ పాండ్య‌..సూర్య‌కుమార్ యాద‌వ్ తో పాటు ప‌లువురు ఆట‌గాళ్లు   చ‌ర‌ణ్ ఇంటికి చేరుకుని సంద‌డి చేసారు.

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ వాళ్లంద‌ర్నీ స‌న్మానించారు.  వాళ్ల‌తో స‌ర‌ద‌గా గ‌డిపారు. చ‌ర‌ణ్ -ఉపాస‌న‌ల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ పార్టీలో పాల్గొన్నారు. త్వ‌ర‌లోనే ఆ పార్టీ ఫోటోల‌ను చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయనున్నారు.

అలాగే పాండ్య చ‌ర‌ణ్ ఇంటి వ‌ద్ద ఓ వ్య‌క్తిగతో దిగిన ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. మ‌రిన్ని ఫోటోలు బ‌య‌ట‌కు వ‌స్తే అభిమానుల కు పండ‌గే.  ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ త‌న 15వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి  తెలిసిందే. దీనికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ పూర్తి చేసారు.

బ్యాలెన్స్ షూట్ స‌హా పోస్ట్ ప్రొడక్ష‌న్ పనులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే చర‌ణ్ త‌దుప‌రి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న కంటెంట్ తోనే ప్రేక్ష‌ల‌కు ముందుకు రావాల‌ని బ‌లంగా సంక‌ల్పించి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News