హైద్రాబాద్ లో ఐఫా అవార్డుల వేదిక అంగరంగ వైభవంగా జరుగుతోంది. దక్షిణాది నటులందరూ తరలి రావడంతో.. హైద్రాబాద్ ఫుల్లు కలర్ ఫుల్ గా మారిపోయింది. కుర్ర జనరేషన్ కి తోడు ఒకటి రెండు తరాల వెనక వరకూ అందాల భామలు, అభిమాన హీరోయిన్లు సందడి చేస్తుండడంతో.. అవార్డుల వేడుక వేదిక పండుగ వాతావరణాన్ని సంతరించుకోనుంది.
ఐఫా అవార్డుల వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెర్ఫామ్ చేయనుండడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఆ పండుగ ఎప్పుడా అని మెగా ఫ్యాన్స్ అంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇలా స్టేజ్ మీద పెర్ఫామ్ చేయనుండడం చెర్రీకి ఇదే మొదటిసారి కావడం విశేషం. సాధారణంగా చాలా మొహమాటంగా కనిపిస్తూ, చెప్పే నాలుగు మాటలను కూడా ముక్తసరిగా చెప్పేసి వెళ్లిపోతాడు రామ్ చరణ్. అలాంటిది స్టేజ్ పై డ్యాన్స్ వేయడమంటే మెగా అభిమానులకు పండుగే. ఆ పండుగ ఎప్పుడో కాదు.. ఇవాళే(జనవరి 25) కావడం విశేషం. ఇవాళ రాత్రికి చరణ్ లైవ్ పెర్ఫామెన్స్ ఉండనుంది.
ఏడు నిమిషాల పాటు రామ్ చరణ్ పెర్ఫామ్ చేయనున్నాడు. తన హిట్ సాంగ్స్ తోపాటు.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ కూడా ఇందులో ఉంటాయట. మొత్తానికి మెగాస్టార్ ని, పవర్ స్టార్ ని.. స్టేజ్ పైనే చూపించేందుకు చరణ్ రెడీ అయిపోతున్నాడు. సో ఫ్యాన్స్.. డోండ్ మిస్ మెగా పెర్ఫామెన్స్ టుడే.