సెట్ చేస్తానని మాటిచ్చిన చెర్రీ

Update: 2017-04-26 04:59 GMT
రామ్ చరణ్ మెగాస్టార్ వారసుడిగా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. మాస్ మూవీస్ నుంచి రీసెంట్ గా ట్రెండ్ మార్చిన మెగా పవర్ స్టార్.. విభిన్నమైన కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. అంతే కాదు.. నిర్మాతగా మారి ఏకంగా మెగాస్టార్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టేశాడు.

ఇప్పుడు తమ్ముడు వరుణ్ తేజ్ కు కూడా సక్సెస్ అందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ముకుంద.. కంచె అంటూ తొలి రెండు చిత్రాలతో ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. అయితే.. ఆ తర్వాత వచ్చిన లోఫర్.. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ చిత్రాలు నిరుత్సాహపరిచాయి. ముఖ్యంగా మిస్టర్ విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యాడట ఈ మెగా హీరో. మూవీస్ ని సెలెక్ట్ చేసుకోవడంలో వరుణ్ తేజ్ పడుతున్న ఇబ్బందిని గమనించిన రామ్ చరణ్.. తమ్ముడికి ఓ మాంచి ప్రాజెక్ట్ సెట్ చేస్తానంటూ బాబాయ్ నాగబాబు మాటిచ్చాడట చెర్రీ.

వరుణ్ తేజ్ కోసం మంచి కథ సిద్ధం చేయాలని పలువురు స్టోరీ రైటర్స్.. దర్శకులతో కూడా చెప్పాడట. అవసరమైతే తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని కూడా చెప్పడంతో.. ఇప్పుడు చెర్రీని మెప్పించే పనిలో పడ్డారు చాలా మంది. ప్రస్తుతం తనతో పని చేస్తున్న దర్శకులకు అసిస్టెంట్స్ గా వర్క్ చేస్తున్న వారిపై కూడా ఓ కన్నేసి ఉంచాడట మెగాపవర్ స్టార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News