చెప్పాల్సింది సూటిగా చెప్పేస్తే ఆ కిక్కే వేరు. తాజాగా ఒక యాడ్ అలాంటి పనే చేసి అందరినీ ఆకర్షిస్తోంది. ఈ యాడ్ ప్రత్యేకత ఏమంటే.. కేవలం 25 సెకన్ల వ్యవధిలో నలుగురు స్టార్లను యాడ్ ను సిద్ధం చేయడం.. మొత్తం యాడ్ నిడివి 30 సెకన్లు అయితే.. స్టార్లు కనిపించేది మాత్రం 25 సెకన్లు. ఈ యాడ్ కున్న మరో ప్రత్యేకత ఏమంటే.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ అలియాస్ చెర్రీ ఈ యాడ్ లో తళుక్కుమనటం.
ఆన్ లైన్ షాషింగ్ లో సంచనలంగా మారిన 'మీసో' తాజాగా రిలీజ్ చేసిన యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్ లోనూ తెగ ఆకర్షిస్తోంది. చాలా తక్కువ నిడివిలో భారీ క్యాస్టూమ్ తో సిద్ధం చేసిన ఈ యాడ్ ను చూసినంతనే మనసులో రిజిస్టర్ అయ్యేలా డిజైన్ చేశారు. పలు భాషల్లో సిద్ధం చేసిన ఈ యాడ్ కు.. ప్రాంతానికి తగ్గ సినీ స్టార్లతో పాటు.. మరో ఇద్దరు క్రికెటర్ స్టార్లను వినియోగించిన తీరు ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.
తెలుగు వెర్షన్ లో రాంచరణ్.. రష్మిక మందన్నలతో పాటు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. క్రికెట్ దాదా సౌరభ్ గంగూలీతో సిద్ధం చేసిన ఈ ప్రకటన ఆకట్టుకునేలా ఉంది. రండి.. విచ్చేయండి.. నమస్కారం.. మార్కెట్లకే రారాజు అంటూ గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పేస్తే.. క్యూట్ గా రష్మిక ఆకట్టుకుంది.
వీరిద్దరూ సరిపోనట్లు రోహిత్ శర్మ.. గంగూలీతో స్టార్స్ బొనాంజాగా యాడ్ మారింది. తమిళ వెర్షన్ లో రాంచరణ్ కు బదులుగా కార్తీ.. రష్మిక బదులుగా త్రిషను వాడేశారు.
తెలుగు యాడ్ విషయానికి వస్తే.. రాంచరణ్ కు స్క్రీన్ టైం ఎక్కువగా ఇవ్వటం కనిపిస్తుంది. కేవలం పాతిక సెకన్ల యాడ్ లో నలుగురు స్టార్లను వినియోగించిన ఈ యాడ్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View