రామ్‌ చరణ్‌ కొత్త సినిమా.. ఆ విషయంలో రేపే క్లారిటీ

Update: 2022-11-27 12:57 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శంకర్ సినిమా తర్వాత వెంటనే యువి క్రియేషన్స్ బ్యానర్లో జెర్సీ చిత్ర దర్శకుడు గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాను రామ్ చరణ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వచ్చాయి.

క్యాన్సల్ అయిన ఆ సినిమా ప్లేసులో రామ్ చరణ్ తదుపరి సినిమా ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించబోతున్నట్లుగా మెగా కాంపౌండ్ నుండి వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తన తదుపరి సినిమా ను ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

ఆ విషయమై రేపు ఒక స్పష్టత వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఉప్పెన సినిమా తో సక్సెస్ దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఇటీవలే రామ్ చరణ్ ని కలిసి కథ వినిపించాడని వార్తలు వస్తున్నాయి. కనుక రామ్ చరణ్ తదుపరి సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో ఉంటుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సమయంలోనే బుచ్చిబాబు కాకుండా కన్నడ దర్శకుడు నార్థాన్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ సినిమా ఉండే అవకాశాలు లేకపోలేదు అంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తానికి రామ్ చరణ్ తదుపరి సినిమా విషయంలో రేపు లేదా ఎల్లుండి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న శంకర్ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాదే మరో సినిమా ను కూడా రామ్ చరణ్ విడుదల చేయాలనే ఉద్దేశంతో నేడు లేదా రేపు అన్నట్లుగా తదుపరి సినిమా ను ప్రకటించేందుకు వెయిట్ చేస్తున్నాడట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News