నిజానికి తెలుగులో మాత్రమే అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నారనుకుంటే.. ఇపుడు ఏకంగా అదే తేదీన తమిళంలో కూడా రిలీజ్ చేసేస్తున్నారు. అదేనండీ.. ఒకేసారి బ్రూస్ లీ సినిమా ఇటు తెలుగు తమిళంలో రిలీజ్ అయిపోతోంది. అక్కడ బ్రూస్ లీ 2 అనే టైటిల్ తో రిలీజ్ అవుతున్న విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా.. ఇకపోతే ఇవాళే అక్కడ ఆడియో లాంచ్ జరిగింది.
మ్యాటర్ ఏంటంటే.. తమిళంలో జరిగిన ఆడియో లాంచ్ కు రామ్ చరణ్ హాజరు కాలేదు. ఒకపోతే హైదరాబాద్ లోనే మకాం వేసి బ్రూస్ లీ ని బీభత్సంగా ప్రమోట్ చేస్తున్న రకుల్ ప్రీత్ మాత్రం.. చక్కగా అక్కడ గ్లామరస్ గా మెరిసింది. అంతేకాదు.. బీభత్సంగా చెర్రీని పొగిడేస్తూ సినిమాను ప్రమోట్ చేసింది కూడా. అయితే అసలు చరణ్ ఎందుకు రాలేదు మరి? ఒకవేళ అయ్యప్ప మాలలో ఉంటే ఊరు దాటి వెళ్లకూడదా? ఒక ప్రక్కన దర్శకుడు శ్రీను వైట్ల ఆల్రెడీ అయ్యప్ప మాలను తీసేసినట్లు తెలుస్తోంది. అంటే వ్రతం పూర్తయినట్లేగా.. మరి చెర్రీ పరిస్థితి ఏంటో? నిజానికి మనోడు డబ్బింగ్ పని పూర్తవ్వకపోవడంతో ఇక్కడే ఉండిపోయాడట. అది సంగతి.
అయినాసరే తమిళ ఆడియో మాత్రం.. లారెన్స్.. గౌతమ్ మీనన్.. అతిథులుగా రావడంతో.. అక్కడ బాగానే సాగింది. పైగా అక్కడి లోకల్ ప్రొడ్యూసర్లు కూడా తమిళ డబ్బింగ్ సినిమా అయినా కూడా దీనిని ఏదో ఒరిజినల్ మూవీ అన్నట్లు దంచేస్తున్నారు . ఖచ్చితంగా రామ్ చరణ్ అక్కడ ఒక సూర్య టైపులో క్లిక్కవుతాడేమో మరి.