దీపావ‌ళి ట‌పాసులు.. చెర్రీ బ‌న్నిలో ఎవ‌రు బెస్ట్?

Update: 2019-10-27 09:37 GMT
దీపావ‌ళి పండగ అంటే ప్ర‌తి ఇంటికి ల‌క్ష్మి క‌ళ ఉట్టిప‌డుతుంది. చుట్టాలు ప‌క్కాల‌తో సంద‌డిగా ఉంటుంది. ఉమ్మ‌డి కుటుంబాల్లో క‌జిన్స్ అంతా ఓచోట చేరి ట‌పాసులు కాలుస్తుంటే ఆ ఆనందం చూసేవారికి అంతా ఇంతా కాదు. పెద్దాళ్ల‌కు అంత‌కంటే సంద‌డి ఏం ఉంటుంది. ఈసారి దీపావ‌ళి కొణిదెల కాంపౌండ్ లో ఎలా ఉండ‌బోతోంది? అంటే.. ఓ రేంజులో క‌న్నుల‌పండుగ‌గా ప్లాన్ చేశార‌ట చెర్రీ.

ప్ర‌తిసారీ జ‌రిగే దీపావ‌ళి వేరు. ఈసారి దీపావ‌ళి వేరు. సైరా స‌క్సెస్ తోనే ఇప్ప‌టికే ధ‌న‌ల‌క్ష్మి ఇంటికి చేరుకుంద‌ని రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. దాదాపు 50 మంది క‌జిన్స్ త‌మ ఇంటికి చేరుకుని దీపావ‌ళి సంబ‌రాలు చేయ‌బోతున్నార‌ని వెల్ల‌డించారు. ట‌పాసులు కాల్చడంలో ఎవ‌రు బెస్ట్? అని ప్ర‌శ్నిస్తే .. తాను మాత్రం చిన్న‌ప్ప‌టి నుంచి ట‌పాకాయ‌ల‌కు దూరం అని తెలిపారు. తాను సైలెంట్ గా ఉండేందుకే ఇష్ట‌ప‌డేవాడిన‌ని చ‌ర‌ణ్ వెల్ల‌డించారు. బ‌న్ని ఈ విష‌యంలో స్పీడ్ గా  ఉంటాడు. ట‌పాసులు పేల్చ‌డంలో బ‌న్ని త‌ర్వాతే అని తెలిపారు.

ఇంట్లో పిల్ల‌లంతా ట‌పాసులు కాల్చేప్పుడు వాళ్ల‌కు సాయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఎంజాయ్ చేస్తార‌ట‌. బావుంది. ఈ దీపావ‌ళి వేళ `చిరంజీవి దోసె`ను కూడా అంద‌రికీ వేడి వేడిగా ప్లేట్ల‌లో స‌ర్వ్ చేస్తారా ఏమిటో! కాస్త తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News