చెర్రీ.. లాభాల్లో వాటా నిజ‌మేనా?

Update: 2019-01-08 16:36 GMT
స్టార్ హీరోలు లాభాల్లో వాటాలు తీసుకుంటార‌ని ఇటీవ‌ల మీడియాలో క‌థ‌నాలొస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే  లాభాల్లో వాటా ఏ బేసిస్ లో అడుగుతారు? అన్న‌దానిపై ఎవ‌రికీ క్లారిటీ లేదు. లాభాల్లో వాటా అంటే ఏ కోణంలో అడుగుతారు?  నిర్మాత‌ల‌పై హీరోలు అజ‌మాయిషీ చేస్తారా?  హీరోకి భ‌య‌ప‌డి నిర్మాత వాటా ఇచ్చేందుకు అంగీక‌రిస్తారా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు జ‌నాల్లో ఉన్నాయి.

వీట‌న్నిటికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ చేశారు. నేటి మ‌ధ్యాహ్నం `విన‌య విధేయ రామ` ప్ర‌చార ఇంట‌ర్వ్యూల్లో చ‌ర‌ణ్ కి ఈ ప్ర‌శ్న ఎదురైంది. లాభాల్లో వాటా అడుగుతార‌ట క‌దా?  సినిమా బ‌డ్జెట్లు అదుపులో ఉంచాల్సింది పోయి - పారితోషికం - వాటాలు అంటూ బ‌డ్జెట్ పెంచేస్తారేం? అని పాత్రికేయులు అడిగిన ప్ర‌శ్న‌కు చ‌ర‌ణ్ త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ చేశారు.

మార్కెట్ .. లాభాలు లాంటి లెక్క‌లు నాకైతే తెలీదు. అయినా వాటితో ఎందుకు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారం.. నాకేం కావాలో అది ముందే అడిగి నిర్మాత నుంచి తీసుకుంటాను! అంటూ సాఫ్ట్ గా చెప్పారు చెర్రీ. ఒక‌వేళ లాభాల్లో వాటా కావాల్సి వ‌స్తే నిర్మాత‌ల‌తో క‌లిసి పెట్టుబ‌డులు పెడ‌తాను కానీ - నా బ్యాన‌ర్ పేరు చెప్పి వాటాలు అడ‌గ‌న‌ని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేశారు. అయితే చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామా` చిత్రానికి - `ఆర్.ఆర్.ఆర్` చిత్రానికి క‌లిపి నిర్మాత డివివి దాన‌య్య‌ను లాభాల్లో వాటాలు అడిగార‌ని - ఆయ‌న పారితోషికానికి ఇది అద‌నం అని ఇదివ‌ర‌కూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే అలాంటిదేమీ లేద‌ని చ‌ర‌ణ్ చెప్పిన దానిని బ‌ట్టి అర్థ‌మైంది. `సైరా` త‌ర్వాత  మెగాస్టార్ -కొరటాల శివ కాంబినేషన్ మూవీలో మాత్రం వాటా ఉంద‌ని - అందులో నిర్మాత నిరంజన్ రెడ్డితో సమానంగా నేను కూడా పెట్టుబడి పెడతాన‌ని చ‌ర‌ణ్ క్లారిటీనిచ్చారు. అంటే వాటాలు అడిగేప్పుడు స్టార్ హీరోల‌కు ఎథిక్స్ కూడా ఉంటాయ‌ని చ‌ర‌ణ్ చెప్ప‌క‌నే చెప్పారు. ఇండ‌స్ట్రీలో ఏదైనా నీతి నియ‌మం మాత్ర‌మే నిల‌బ‌డ‌తాయని త‌న‌దైన శైలిలో బాగానే చెప్పారు చెర్రీ.




Tags:    

Similar News