మెగా వారసుడిగా సినిమా సినిమాకు ఒక మెట్టు ఎదుగుతున్న రామ్ చరణ్ తేజ్ తండ్రి ఇచ్చిన వారసత్వ సంపదకి న్యాయం చేస్తున్నాడు. తన తండ్రి ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టం తనకు తెలుసునని, అందుకే ఆయనే నా ఫేవరేట్ హీరో అని చెప్పుకొస్తున్నాడు.
చిరు సినిమాలలో రీమేక్ చెయ్యాలంటే ఏ సినిమా మీ మనసులో స్మరిస్తుంది అన్న ప్రశ్నకు.. నాన్నగారి ఖైది సినిమా ఒక అద్భుతమని, అందులో ఆయన పాత్ర తనని ఎప్పుడూ రంజింప చేస్తుందని తెలిపాడు. ఆ సినిమానేకాక గ్యాంగ్ లీడర్ - జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు కూడా చాలా ఇష్టమని వీటిలో దేని రిమేక్ అయినా బాగుంటుందని తెలిపాడు.
చరణ్ - చిరు కలిసి నటించిన బ్రూస్ లీ సినిమా వచ్చే వారం విడుదలకానుంది. వారం వ్యవధిలో రెండు పెద్ద చిత్రాలేందుకు ఒకటి వాయిదా వెయ్యచ్చుగా అన్న ప్రశ్నకి మేము ఎవ్వరి మీదా పడలేదని, వాళ్ళే మా మీద పడుతున్నారని, షూటింగ్ మొదటిరోజే చూచాయిగా రిలీజ్ డేట్ చెప్పామని తెలిపారు. ఇలా మీడియా ద్వారా కాకుండా డైరెక్ట్ గా మమ్మల్ని సంప్రదించి వుంటే ఆ పరిస్థితి వేరేగా వుంటుందేమో అని అన్నాడు. ఇంతకీ చరణ్ ఏ సినిమా గురించి మాట్లాడాడో మీకు అర్ధమయ్యింది కదా...