మహేష్ రికార్డు దత్తత తీసుకున్న చరణ్

Update: 2018-04-02 09:42 GMT
శ్రీమంతుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది. చాలా తీసుకున్నారు ఇచ్చేయండి లేకపోతే లావైపోతారు అందుకే ఊరిని దత్తత తీసుకోండి అని. సరిగ్గా ఇది సూత్రాన్ని రామ్ చరణ్ తన రంగస్థలం సినిమా ద్వారా అక్షరాల పాటించి చూపిస్తున్నాడు. ఎలా అంటారా. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీమంతుడు నెలకొల్పిన బలమైన రికార్డుని మొదటి వారం పూర్తి కాకుండానే చాలా తేలిగ్గా బద్దలు కొట్టేలా ఉన్నాడు చిట్టిబాబు. మూడేళ్ళ క్రితం విడుదలైన శ్రీమంతుడు ఫుల్ రన్ లో ఓవర్సీస్ లో 2.87 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇది నాన్ బాహుబలి కోవలోకి వస్తుంది. కాని రంగస్థలం ఊహలకు అతీతంగా కేవలం నాలుగు లేదా మహా అయితే ఐదు రోజుల్లో 3 మిలియన్ మార్క్ అందుకోబోతున్నాడు అనే వార్త అక్కడి ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది.

ఓవర్సీస్ లో రంగస్థలం కాన్సెప్ట్ ఎన్ ఆర్ ఐలకు విపరీతంగా కనెక్ట్ అవుతుండటంతో ఈ వసూళ్లు సాధ్యమవుతున్నాయి. అనూహ్యంగా రెండో రోజే 2 మిలియన్ క్లబ్ లో అడుగుపెట్టిన రంగస్థలం ఆదివారం ఒక్క రోజే 3 లక్షల డాలర్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఈ రేంజ్ ఇలాగే కొనసాగితే శ్రీమంతుడు రికార్డుని చిట్టిబాబు అధికారికంగా దత్తత తీసుకున్నట్టే. ప్రీమియర్ షోలతోనే 7 లక్షల డాలర్లు వసూలు చేసిన రంగస్థలం ఇంకొక్క వారం ఇదే రన్ కంటిన్యూ చేస్తే మరో 18 రోజుల్లో రానున్న భరత్ అనే నేను ముందు పెద్ద సవాలే ఉంచుతుంది. కాకతాళీయం ఏంటంటే శ్రీమంతుడు ఇదే మైత్రి మూవీస్ మేకర్స్ మొదటి సినిమా కాగా రంగస్థలం వారి మూడో సినిమా.

రంగస్థలం ఓవర్సీస్ లో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ట్రేడ్ లో ఆసక్తికరంగా మారింది. చాలా చోట్ల ఖైది నెంబర్ 150 పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డ్స్ తన ఖాతాలో వేసేసుకుంటున్న రంగస్థలంకు బ్రేకులు పడటం కూడా అంత ఈజీగా కనిపించడం లేదు. అంతకంతకు పెరుగుతున్న మౌత్ పబ్లిసిటీ కలెక్షన్లను స్టడీగా ఉండేలా చేస్తోంది. విజయవాడ లాంటి నగరాల్లో మండుటెండల్లో సైతం 70 శాతం పైగా ఆక్యుపెన్సి దీన్నే సూచిస్తోంది. వంద కోట్ల గ్రాస్ దాటేసిన చిట్టిబాబు పరుగు ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. 
Tags:    

Similar News