‘రంగస్థలం’ సినిమాతో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా వచ్చిన రామ్ చరణ్... టాలీవుడ్ లో ఒక్కో రికార్డు తిరగరాసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్టు దిశగా దూసుకుపోతున్న ‘రంగస్థలం’... ఇప్పుడు మరో రికార్డు తిరగరాయడానికి అతి చేరువలో ఉంది. అది రామ్ చరణ్ బాగా వీక్ అయిన నైజాం ఏరియాలో!
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమా నైజాంలో దాదాపు 22 కోట్ల షేర్ రాబట్టింది. అప్పట్లో ఇదో సంచలనం. అయితే ఆ తర్వాత చాలా సినిమాలు ఆ రికార్డును చెరిపేసి అదిరిపోయే వసూళ్లు రాబట్టాయి. జక్కన్న ‘బాహుబలి’ సినిమాలైతే నైజాం నుంచే 50 కోట్ల దాకా షేర్ రాబట్టాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ఈ ఫీట్ ను దాటేసి కొత్త రికార్డులు సృష్టించాయి. చెర్రీ మాత్రం మగధీర తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాడు. ఇప్పుడు ‘రంగస్థలం’ సినిమాతో చరణ్ కి ఆ అవకాశం దొరికింది. ఈ వారంతంలో ‘మగధీర’ వసూళ్లను దాటేయబోతోంది ‘రంగస్థలం’.
వచ్చే వారం ఇలాగే కలెక్షన్లు కొనసాగితే ఏకంగా 25 కోట్ల షేర్ క్లబులో కూడా చిట్టిబాబు చేరే అవకాశం ఉంది. అయితే అదేమంత తేలిక కాదు. ఎందుకంటే రేపు నాని ‘కృష్ణార్జున యుద్ధం’ నైజాంలో భారీ థియేటర్లలో విడుదలవుతోంది. ఆ తర్వాతి వారం మహేష్ ‘భరత్ అనే నేను’తో బరిలో దిగుతాడు. సో... కొంచెం కష్టమైనా పనే కానీ అసాధ్యమైతే కాదు.