రంగస్థలం సినిమాతో అనుకున్నట్టుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. సినిమా సరికొత్తగా అనిపించడంతో ప్రేక్షకులు మొదటి ఆటకే బాక్స్ ఆఫీస్ మార్కులు వేశారు. అన్ని ఏరియాల్లో రంగస్థలం సినిమాకు మంచి కలెక్షన్స్ అందాయి. రామ్ చరణ్ కెరీర్ లోనే ఎప్పుడు లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇకపోతే ప్రవాసులకు కూడా రామ్ చరణ్ సినిమా బాగా నచ్చేసింది.
ప్రీమియర్స్ తోనే సినిమా హిట్టు అని తేలిపోయింది. అందులోను సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. యూఎస్ లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రంగస్థలం సినిమా యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసింది. ఇంతకుముందు ధృవ కూడా ఇదే తరహాలో 1 మిలియన్ డాలర్స్ ని ఫాస్ట్ గా అందుకుంది. గురువారం ప్రీమియర్స్ ద్వారా సినిమా 165 లొకేషన్స్ లో రిలీజ్ అయ్యి 706,612 డాలర్లను అందుకుంది.
ఇక శుక్రవారం ఉదయం 10.15 గంటలకు 151 స్థానాల్లో 510k డాలర్లు సేకరించింది. ఆ తరువాత 1,215K ను అందుకొని మొత్తంగా శుక్రవారం USD 600K తో రికార్డు సృష్టించింది. ఈ లెక్కలను చూస్తుంటే రంగస్థలం 2 మిలియన్ క్లబ్ లో చేరడానికి సమయం ఎక్కువగా పట్టేలా లేదు. మొత్తానికి మెగా పవర్ స్టార్ ఈ ఏడాది ఒక ఇండస్ట్రీ హిట్ అందుకోవడం పక్కా అని ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.