మీడియాకు పెద్ద సెల్యూట్ -రామ్ చరణ్‌

Update: 2016-12-24 07:30 GMT
''ఒక నటుడిగా నాకు మంచి పేరు వచ్చినందుకు చాలా థ్యాంక్యూ. మా నాన్న గారు ఫస్ట్ టైమ్ ఎప్రీషియేట్ చేశారు. అయితే ఈ క్రెడిట్ చాలామటుకు మీడియాకు ఇవ్వాలి. మంచి సినిమాలు తీసినా రేటింగులు ఇవ్వరని మీడియాపై కామెంట్లు చేస్తారు. ఎందుకివ్వరండి? ఎందుకు ఇవ్వరు? ధృవ సినిమాకు ఇచ్చారుగా. డీమానిటైజేషన్లో కూడా సినిమా ఆడిందంటే.. కారణం మీడియా ఇచ్చిన రేటింగులే. వారు రాసిన ఆర్టికల్సే. మీడియాకు పెద్ద సెల్యూట్'' అంటూ మీడియాను ఆకాశానికి ఎత్తేశాడు రామ్ చరణ్.

మీడియాను సైతం తన కామెంట్లతో మెస్మరైజ్ చేయడం అంటే రామ్ చరణ్‌ కే చెల్లింది. ధృవ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడిన మెగా పవర్ స్టార్.. కొన్ని రియలిస్టిక్ కామెంట్లతో ఆకట్టుకున్నాడు.  ''ఒకవేళ నా సీటు కాపాడుకోవడానికో.. లేదంటే నెంబర్ల కోసమే సినిమాలు చేస్తే.. అవి వస్తాయి.. కాని నన్నెవరు కాపాడలేరు అప్పుడు. కెరియర్లో కొన్ని బెస్ట్ సినిమాలు కూడా ఉండాలి. ఎప్పుడూ సేఫ్‌ జోన్ లోనే సినిమాలు చేస్తే ఎలా?'' అంటూ స్టన్ చేశాడు. అయితే ఈ విషయంలో మణిరత్నం కు థ్యాంక్స్ చెప్పాడు చరణ్‌. ''ఒకసారి నాకు మణిరత్నం గారు ఏం చెప్పారంటే.. నీకు స్టార్డమ్ ఉంది.. పెద్ద హీరోవి.. మార్కెట్ ఉంది.. ఎందుకిలా సేఫ్‌ జోన్ లో సినిమా చేస్తున్నావు? నాతో సినిమా చేస్తే నీ కెరియర్లో ఇదో ల్యాండ్ మార్క్ అవుతుంది అన్నారు. ఆయన మాటల ప్రభావంతోనే బహుశా నేను ధృవ సినిమాను టేకప్ చేసినట్లున్నాను'' అన్నాడు. అలాగే వరుసపెట్టి గీతా ఆర్ట్స్ ఇలాంటి సినిమాలో మీతోనే చేస్తోంది.. బన్నీతో ఎందుకు అరవింద్ గారు చేయట్లేదు అని అడిగితే.. చరణ్‌ ఏమన్నాడో తెలుసా?

''ఆల్రెడీ నాకైనా బన్నీ కైనా అరవింద్ గారు ఇవ్వాల్సినవి ఇచ్చేశారు. ఇప్పుడు నాక్కూడా కొడుకులా ఇలా ఇంకా ఇస్తుంటుంటే ఆనందంగా ఉంది. బన్నీకి కూడా అలాగే ఇచ్చారు. అంతకంటే ఎక్కువ బన్నీ ఆశిస్తే.. అది బన్నీ తప్పే'' అంటూ కామెంట్ చేశాడు చరణ్‌.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News