స్టయిలిష్‌ బ్యానర్‌ లో రామ్‌ చ‌ర‌ణ్?

Update: 2015-11-21 05:24 GMT
రాంచ‌ర‌ణ్.. టాలీవుడ్ స్టార్‌ హీరో. ఫ్లాప్ సినిమాలో న‌టించినా సునాయాసంగా 40 కోట్ల వ‌సూళ్లు తెచ్చే స‌త్తా ఉన్న హీరో. యావ‌రేజ్‌ కి 40 కోట్లు - హిట్టుకి 50 కోట్లు - సూప‌ర్‌ హిట్టుకి 60కోట్లు - అంత‌కుమించి వ‌సూలు చేసే హీరోగా క్యాలిక్యులేష‌న్స్ ఉన్నాయి. అందుకే అత‌డు వ‌రుస ఫ్లాప్‌ లు వ‌చ్చినా టాలీవుడ్ లో అగ్ర నిర్మాత‌లంతా అత‌డి వెంట క్యూక‌డుతుంటారు.

ఇప్పటికే డి.వి.వి.దాన‌య్య‌ - కె.ఎస్‌.రామారావు - అల్లు అర‌వింద్ వంటి దిగ్గ‌జాలు పోటీప‌డి మ‌రీ చ‌ర‌ణ్‌ తో సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి చ‌ర‌ణ్ వీళ్లంద‌రితో పాటు వేరొక కొత్త సంస్థ‌కి అవ‌కాశం ఇవ్వ‌డం టాలీవుడ్‌ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.  మిర్చి - ర‌న్ రాజా ర‌న్‌ - జిల్‌ -  భ‌లే భ‌లే మ‌గాడివోయ్ .. ఇలా వ‌రుస విజ‌యాల‌తో స్టామినా పెంచుకుంటూ రేసులోకి దూసుకొచ్చిన సంస్థ యు.వి.క్రియేష‌న్స్‌. ప్ర‌భాస్ స్నేహితుల‌కు సంబంధించిన బ్యాన‌ర్ ఇది. ఈ సంస్థ ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా ఎక్స్‌ ప్రెస్ రాజా అనే సినిమా నిర్మిస్తోంది. ఇంత‌లోనే స్టార్ హీరో రామ్‌ చ‌ర‌ణ్‌ తో సినిమా చేసేందుకు రేసులోకి వ‌చ్చింది. గోపిచంద్‌ కి జిల్ వంటి హిట్ మూవీని ఇచ్చిన రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంద‌ని టాక్‌.

ఇప్ప‌టికే యు.వి.క్రియేష‌న్స్‌ కి చ‌ర‌ణ్ ప్రామిస్ చేశాడు. ప్ర‌స్తుతం అత‌డు సురేంద‌ర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌ని ఒరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్నాడు. ఆ త‌ర్వాత ఈ మూవీ ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం త‌ని ఒరువ‌న్ ప్రీప్రొడ‌క్ష‌న్ శ‌ర‌వేగంగా సాగుతోంది. డిసెంబ‌ర్ రెండోవారంలో షూటింగ్‌ స్టార్టయ్యే ఛాన్సుంది.
Tags:    

Similar News