ఫోటోస్ లీక్: యాక్షన్ మోడ్ లో మెగా పవర్ స్టార్

Update: 2018-10-15 10:50 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇంకా టైటిల్ ప్రకటించని ఈ సినిమా తాజా షెడ్యూల్ రీసెంట్ గా వైజాగ్ లో ప్రారంభం అయింది.  ఈ షెడ్యూల్ లో భాగంగా చరణ్.. ఇతర ఫైటర్ల పై బోయపాటి శ్రీను ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాడట. దీనికి సంబంధించిన రెండు ఆన్ -లొకేషన్ స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో రఫ్ అండ్ టఫ్ అవతారంలో ఉన్న చరణ్ ఒక కొత్త రకం ఆయుధంతో రౌడీల పని పడుతున్నాడు.  బోయపాటి సినిమాలంటేనే రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి.  ఈ సినిమాలో కూడా అదే స్టైల్ లో చరణ్ కోసం భారీ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్టున్నాడు.  ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ ఫస్ట్ లుక్.. టైటిల్ లోగో ఏవి కూడా విడుదల కాకపోవడంతో అందరూ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోపు పిక్స్ లీకవడంతో అతి తక్కువ సమయంలో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.  ఇదిలా ఉంటే రామ్ చరణ్  బోయపాటి.. చిత్ర యూనిట్ తో కలిసి సింహాచలం అప్పన్న దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారట.  ఆ సమయంలో తీసిన చరణ్ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.  బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఆర్యన్ రాజేష్.. స్నేహ  ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత డీవీవీ దానయ్య.
Tags:    

Similar News