మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..దర్శకుడు కొరటాల శివ విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. చరణ్ అయ్యప్ప మాలలో ఉండటం సహా చిరంజీవి-చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా ఈనెల 29న రిలీజ్ అవుతుండటంతో ఇద్దరు దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే చరణ్ రాక విషయం తెలియడం సహా గుడిలోకి ఎంటర్ అవ్వడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
గుడి లోపల చరణ్ చుట్టుముట్టి జై చరణ్ అటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. చరణ్ తో ఫోటోలు..వీడియోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు..ఆలయ అధికారులు అభిమానుల్ని అదుపు చేయడం అసాధ్యంగా మారింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చాలా మంది కింద పడిపోయారు.
ఆ కారణంగా భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సెలబ్రిటీలు వస్తున్నప్పుడు ప్రత్యేక ఏర్పాటు చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. దీంతో వాళ్లపై భక్తులు మండిపడుతున్నారు.
సినిమా వాళ్లు వచ్చినప్పుడు సామాన్యులకు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? వాళ్ల తర్వాతే మేము అమ్మవారిని దర్శించుకునే వాళ్లం కదా? అని అసహనం వ్యక్తం చేసారు.
దీంతో చరణ్ ..కొరటాల గుడిలో ఎక్కువ సమయం గడపకుండా...స్థానిక మీడియాతో మాట్లాడకుండా వెనుదిగారు. గుడి నుంచి నేరుగా గన్నవరం విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కి చేరుకున్నారు.
అయితే చరణ్ విజయవాడ వస్తున్న విషయం ముందుగా అభిమానులకు తెలియడంతో సిటీలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. చరణ్ బొమ్మలు...షీర్టులు ధరించి సిటీ మొత్తం రౌండ్ వేసారు. ఆ తర్వాత చరణ్ గుడి వద్దకు రాగానే ఆయన వెంట పడ్డారు. ఈ క్రమంలో గుడిలోకి చరణ్ తో పాటు ప్రవేశించే ప్రయత్నం చేసారు.

Security arrangements should have been better...
Man Of Masses #RamCharan Swamy in Vijayawada With Director #KoratalaSiva garu !!
Visiting Kanaka durgamma Temple Today ❤️