మొన్న ‘బ్రూస్ లీ’ ఆడియో పంక్షన్ కి పవన్ కళ్యాన్ వస్తాడు వస్తాడు అని చాలా ఊరించారు అభిమానుల్ని. కానీ పవర్ స్టార్ మాత్రం రాలేదు. పవన్ రాడన్న సంగతి అభిమానులకు కూడా తెలుసు కానీ.. ఏదో చిన్న ఆశతో ఉన్నారు. చివరికి నిరాశే మిగిలింది. ఐతే పవన్ తన ఫంక్షన్ కు రాకపోతేనేం.. చరణే బాబాయి దగ్గరికి వెళ్లిపోయాడు. ‘సర్దార్’ షూటింగ్ జరుగుతున్న సెట్లో సడెన్ గా ప్రత్యక్షమై అక్కడున్న వాళ్లందరికీ షాకిచ్చాడు. ముందు ఇది గాసిప్పే అనుకున్నారు కానీ.. చరణ్ పవన్ తో కలిసున్న ఫొటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ చరణ్.. పవన్ సినిమా సెట్ కి ఎందుకు వెళ్లినట్లు? ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊరికే క్యాజువల్ గా వెళ్లాడని కొందరు.. లేదు తన బేనర్ లో బాబాయి చేయాల్సిన సినిమా గురించి చర్చించడానికి ఇంకొందరు.. కాదు కాదు బాబీతో చేయాలనుకుంటున్న సినిమా గురించి మాట్లాడ్డానికని మరికొందరు.. ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. చరణ్ ఊరికే అలా వెళ్లి బాబాయిని మర్యాదపూర్వకంగా పలకరించి వచ్చాడు. దాంతో పాటు చిరు 150వ సినిమా గురించి ఈ నెల 16న ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు వెల్లడించి.. ఆ ప్రాజెక్టు వివరాలు చెప్పి వచ్చాడట. మొత్తానికి కారణం ఏదైనా బాబాయ్-అబ్బాయ్ కలయిక మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.