రామ్ గోపాల్ వర్మ కామెంట్లే కాదు.. ఆయన ఐడియాలజీనే డిఫరెంట్ గా ఉంటుంది. అందరిలా ఆయన ఆలోచించడనే మాట అందరూ ఒప్పుకుంటారు. అందుకే ఆయనకంటూ పర్టిక్యులర్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆయన తీసిన సర్కారు-3 సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇంతలోనే తాను వెబ్ సిరీస్ తీస్తున్నానంటూ ప్రకటించి మరోసారి న్యూస్ లోకి వచ్చేశారు. ‘తుపాకులు మరియు తొడలు (గన్స్ అండ్ థైస్) మంచి సంలచనమే సృష్టించింది. దీంతోపాటు ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్ నా చాహ్ తీ హై’ పేరిట ఓ షార్ట్ ఫిలిం తీశారు.
నేను సన్నిలియోన్ లా అవ్వాలని అనుకుంటున్నాను నాన్నా అని ఏ కూతురు చెప్పినా తండ్రి ఉలిక్కిపడటం ఖాయం. మరి అలాంటి సినిమా మీరెలా తీశారు.. అదే మాట మీ కూతురు మీకు చెబితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటూ ఆర్.జి.వి.ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దీనికి ఆయన కూల్ గానే సమాధానమిచ్చారు. అలాంటి బిలీఫ్ లేకుండా ఆ షార్ట్ ఫిలిం ఎలా తీయగలనని ప్రశ్నించారు. ఎక్స్ పోజ్ చేసినంత మాత్రాన సన్నీ లియోన్ అయిపోలేరని... బిజినెస్ చేయాలనుకున్న వారందరూ అంబానీ అయిపోరని చెప్పుకొచ్చారు. జీవితంలో ఏదైనా కావాలని కోరుకోవడం తప్పు లేదని, కానీ దానికి లిమిటేషన్స్ ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అందం అనేది 30 ఏళ్ల తర్వాత ఉండదని.. ఈలోగా అందంతో జీవితంలో తాను కావాలనుకున్నది సాధించాలనుకోవడం తప్పు కాదన్నారు. ఇలాంటి ఇష్యూలతోనే ఈ షార్ట్ ఫిలిం తీశానని చెప్పారు.
నా కోసం నేను బతుకుతా. అలాగే ఎవరూ నా కోసం బతకాలని కోరుకోను’ అనే అయాన్ రాండ్ ఫిలాసఫీని తాను నమ్ముతానని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. తాను వీడియో లైబ్రరీ వదిలేసి సినిమాల్లోకి వెళ్లాలనుకోవడం తన తల్లిదండ్రులకు ఏ మాత్రం నచ్చలేదని... అయినా తాను అనుకున్నదే చేశానన్నారు. తల్లిదండ్రులు కాబట్టి పిల్లల కన్నా వారికి ఎక్కువ తెలిసుండాలని రూలేం లేదన్నారు. నా లైఫు నా కోసం నా ఇష్టమొచ్చినట్టే బతుకుతాను. ఇంకొకరి కోసం కాదని తెగేసి చెప్పేశారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/