రామ్ గోపాల్ వర్మ కానీ - పూరి జగన్నాథ్ కానీ.. తమ సినిమాల్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయరు. వాళ్ల మాటలే వారి సినిమాలకు ప్రమోషన్ అన్నమాట. ‘టెంపర్’ సినిమానే చూడండి. రిలీజ్ కు ముందు ప్రెస్ మీట్లు లేవు.. ప్రచార కార్యక్రమాలు లేవు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో చేసిన కామెంట్లతోనే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ వచ్చేసింది. ఆ తర్వాత ‘జ్యోతిలక్ష్మి’ విషయంలోనూ సేమ్ స్ట్రాటజీ ఫాలో అయిపోయారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే వర్మ - పూరి కలిసి కోటలు దాటించేసిన మాటలే కారణం. ఇప్పుడు ‘లోఫర్’ విషయంలోనూ అదే దారిలో నడుస్తున్నారు గురుశిష్యులు.
వర్మ ఇప్పటికే వరుణ్ గురించి, లోఫర్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు ట్విట్టర్ లో. ఇప్పుడు పూరి అందుకున్నాడు. ఆయన చెబుతున్న మాటలు చూస్తే పూరి - వర్మల పబ్లిసిటీ ప్లాన్ల గురించి బాగా అవగాహన ఉన్నవాళ్లు కూడా బురిడీ కొట్టేయాల్సిందే. సెంటిమెంట్లంటే అస్సలు పడని వర్మ ‘లోఫర్’లో మదర్ సెంటిమెంటు చూసి ఫ్లాట్ అయిపోయాడట. చాలా ఎమోషన్ తెచ్చేసుకుని పూరిని ఎడిటింగ్ రూం నుంచి బయటికి పంపించేసి మదర్ సెంటిమెంట్ మీద 30 సెకన్ల ప్రోమో కట్ చేశాడట. ప్రెస్ మీట్ లో ఈ సంగతి చెప్పాడు పూరి. ఇందులో వాస్తవమెంతో కానీ.. ఇది చదివిన, విన్న జనాలకు మాత్రం సెంటిమెంటు అంటే అసహ్యమనే వర్మనే కదిలిపోయాడంటే ‘లోఫర్’లో అంత విశేషం ఏముందో అనుకోవాలన్నమాట. ఇంకా రిలీజ్ కు చాలా టైం ఉండగానే జనాలకు ఎంత ఆసక్తి కలిగించాలో అంతా కలిగించాడు వర్మ. ఇంత మంచి సినిమాకు ‘లోఫర్’ అనే టైటిల్ ఏంటి అని వర్మ - సి.కళ్యాణ్ బుర్ర తినేస్తున్నారంటూ పూరి చేసిన కామెంట్ కూడా మంచి ఎత్తుగడే. దీన్ని బట్టే తెలుస్తోంది.. తమ సినిమాల్ని కేవలం మాటలతో ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఈ గురుశిష్యుల్ని చూసే తెలుసుకోవాలని.