ఫోటోలతో ఎన్టీఆర్ దర్శకుల పోటీ

Update: 2017-10-20 08:16 GMT
ఒక కాన్సెప్ట్ తో కూడిన సినిమాను ఇద్దరు దర్శకులు ఒకే భాషలో తెరకెక్కించడం అనేది సినీ చరిత్రలోనే ఇప్పటివరకు జరగలేదు. కానీ మొదటి సారి టాలీవుడ్ లో జరుగుతోంది. సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఎన్ని మలుపులు తీరిగిందో అందరికి తెలిసిన విషయమే. కానీ అందులో వాస్తవమెంత అనేది ఎవ్వరికి కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడు గురు శిష్యులు ఆ మహానుబావుడి జీవితాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

దర్శకుడు తేజ - రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా ఆయన సినిమాలకు కెమెరామెన్ గా కూడా వర్క్ చేశాడు. అయితే వారు కలలో కూడా అనుకోకుండా ఉండరేమో ఇలాంటి పరిస్థితి వస్తుందని. తేజ - ఎన్టీఆర్ జీవితం స్టాటింగ్ నుంచి ఎండింగ్ వరకు బయోపిక్ ని చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అతని గురువు వర్మ మాత్రం కేవలం లక్ష్మి పార్వతీ ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుండి ఎన్టీఆర్ మరణం వరకు లక్ష్మిస్ ఎన్టీఆర్ అనే సినిమాను తెరక్కేకించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ దర్శకులు ఇద్దరు ఎన్టీఆర్ కు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు. వర్మ వివాదస్పదంగా లక్ష్మి తో ఎన్టీఆర్ ఉన్న ఫోటోని ఎక్కువగా పోస్ట్ చేస్తుంటే తేజ మాత్రం ఎన్టీఆర్ పొలిటికల్ లిడర్ గా ఉన్నప్పటి ఫొటోలని అలాగే సినీ కెరీర్ కి సంబందించిన ఫొటోలని రిలీజ్ చేస్తున్నాడు. సినిమాలకంటే ముందు ఇలా ఫోటోలతో పోటీ పడుతున్నారు ఈ ఎన్టీఆర్ బయోపిక్స్ దర్శకులు.

ఇక ఈ సినిమాలు నెక్స్ట్ ఇయర్ పోటీ పడనున్నాయి. నెక్స్ట్ దీపావళికి రెడీగా ఉండండి అని వర్మ ఇప్పటికే ఒక పోస్టర్ ద్వారా తెలిపాడు. కానీ తేజా మాత్రం ఇంకా కరెక్ట్ డేట్ ని ఫిక్స్ చేయలేదు. మరి వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అనిపించుకుంటారో చూడాలంటే నెక్స్ట్ దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News