ఏదో ఒక సంచలనం లేనిదే రామ్ గోపాల్ వర్మ ఊరుకోడు. నిన్ననే రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ టైటిల్ తో సినిమా తీస్తున్నా అంటూ మరో సంచలనానికి తెర తీశాడు. సరిగ్గా రామ్ చరణ్ బ్రూస్ లీ ఆడియో రిలీజ్ టైమ్ లో వర్మ ఇలా నానా యాగీ ఎందుకు చేస్తున్నాడు? అన్న డిష్కసన్ టాలీవుడ్ లో సాగుతోంది. అయితే ప్రస్తుతం ఈ టైటిల్ రిజిస్ర్టేషన్ ని ఫిలింఛాంబర్ ఎలా ఆమోదిస్తుంది అన్నది డిష్కసన్ పాయింట్.
గతంలో నందమూరి కళ్యాణ్ రామ్ కత్తి టైటిల్ విషయంలోనూ ఇలానే జరిగింది. కత్తి టైటిల్ ని వేరొకరు రిజిష్టర్ చేయించుకున్నా.. కళ్యాణ్ రామ్ అదే టైటిల్ ని తన సినిమాకి పెట్టుకున్నాడు. అయితే దీనికి ఛాంబర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే కళ్యాణ్ రామ్ కత్తి అంటూ మ్యానేజ్ చేసేసి సినిమాని రిలీజ్ చేశారు. అదంతా ఇన్ ఫ్లూయెన్స్ వల్ల సాధ్యమైంది. కానీ ఇప్పుడు టైటిళ్ల విషయంలో ఛాంబర్ చాలా పక్కాగా ఉంది. ఒకరు రిజిష్టర్ చేసుకున్న టైటిల్ తో, పైగా షూటింగ్ పూర్తయిన సినిమాకి సంబంధించిన టైటిల్ తో ఇంకెవరూ సినిమా ప్లాన్ చేయకూడదన్న రూల్ ఉంది. అయినా రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ అంటూ కొత్త టైటిల్ ని తెరపైకి తెచ్చాడు. ఇదంతా అతడు ఫ్రీ పబ్లిసిటీ కోసం ఆడుతున్న మైండ్ గేమ్ అంటూ విమర్శలొస్తున్నాయి.
అయినా ఆర్జీవీ ఈ రచ్చంతా ఏంటి? ఇప్పటికే మధ్యలో ఆగిపోయిన సినిమాల గురించి ఆలోచించకుండా కొత్త సినిమా తైతక్కలేంటి? కిల్లింగ్ వీరప్పన్ అంటూ హడావుడి చేశావ్. దానికి సంబంధించిన అప్ డేట్ లేదు. మంచు మనోజ్ హీరోగా ఎటాక్ సినిమాని మధ్యలోనే ఆపేశావ్. ఆ తర్వాత మనోజ్ కి పెళ్లయిపోయింది. అతడికి బిడ్డ పుట్టేలోపైనా ఈ సినిమా పూర్తవుతుందా? అంటే అదీ సందేహమే. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ నీకు అవసరమా? అని మెగా ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అయినా ఈ రచ్చ ఎందుకు వర్మాజీ?