ఖబడ్దార్.. డబల్ ఖబడ్దార్: వర్మ

Update: 2019-02-05 04:40 GMT
పురాణాల్లో నారదుడు కలహ భోజనుడు అని.. ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పి గొడవ పెట్టందే అయనకు తృప్తి ఉండదని అంటూ ఉంటారు. ఈ జెనరేషన్లో అలాంటి వ్యక్తి ఒకరున్నారు. రామ్ గోపాల్ వర్మ.. అయన గొడవలు పెట్టే రకం కాదుకానీ వివాదాలను.. సంచలనాలను సృష్టించే రకం. ఇలాంటివాటికి ఆయన పర్మనెంట్ అడ్రెస్.  వివాదాలు.. సంచలనాలు లేకపోతే అయనకు అస్సలు మనశ్శాంతి ఉండదు. తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో ప్రమోషన్స్ లో సోషల్ మీడియాలో ఫుల్లుగా వాడుకుంటున్నాడు.

తెల్ల చొక్కా.. ఎగ్గట్టిన తెల్లపంచె.. చేతిలో ఓ పొడవాటి కత్తిని పట్టుకున్న మనిషి ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి ట్వీట్ల వర్షం కురిపించాడు వర్మ.   మార్ఫింగ్ చేసిన ఆ ఫోటోలో ఫేస్ మాత్రం వర్మదే.  ఫోటోతో పాటు అయనవేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి.

"ఏయ్ #లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్దార్."

"రేరేయ్ ఎన్టీఆర్ కథానాయకుడు కాదు .. మహానాయకుడు కాదురా.. ఆయన అసలు నాయకుడు.. ఆ నిజం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకీ #లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని అసలు కథతో తెలుస్తుందిరా.. డబల్ ఖబడ్దార్."

"ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు.. నేను ముదురు నాయకుడిని.. మిగతా వాళ్ళు రకరకాల వేరే రకాల నాయకులు..వెన్నుపోటు నాయకులతో సహా."

"సారీ టైపింగ్ మిస్టేక్.. ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు.. నేను ముదురు నాకొడుకుని.. మిగతా వాళ్ళు రకరకాల వేరే రకాల నాయకులు..వెన్నుపోటు నాయకులతో సహా."   

ఈ ట్వీట్లకర్థం తన సినిమాకు అడ్డంకులు సృష్టించడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని.. ఒకవేళా అలా చేస్తే వారిని వదలనని వార్నింగ్ ఇవ్వడమే కదా?సినిమా రిలీజ్ డేట్ ప్రకటించకముందే ఇలా ఉంటే ఇక విడుదల తేదీ ప్రకటన తర్వాత మరింతగా రెచ్చిపోతాడేమో గురుడు. 
Tags:    

Similar News