డ్రగ్స్ విచారణపై తనకున్న ఆగ్రహాన్ని ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా నటి ఛార్మీ విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పలు అంశాల మీద తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఛార్మీ పేరుతో ఎటకారం చేసుకున్న ఆయన పోస్టులు చూస్తే.. అటు ఛార్మికి.. ఇటు సిట్ అధికారుల పైనా వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది.
సిట్ విచారణ అనంతరం నటి ఛార్మీ మరింత అందంగా.. ఆనందంగా కనిపించిందన్న వ్యాఖ్యను చేశారు. బుధవారం సిట్ కార్యాలయానికి వచ్చిన ఛార్మీ.. విచారణకు ముందు కాస్తంత త్రోటుపాటుతో కనిపించినా.. విచారణ పూర్తి అయి వెళ్లే ముందు మాత్రం హ్యాపీగా నవ్వుతూ వెళ్లిపోవటం పలువురికి మింగుడుపడని రీతిలో మారింది. అంతేనా.. ఛార్మీ తీరు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ఇదే విషయాన్ని వర్మ తన పోస్టులతో చెప్పుకొచ్చారు.ఇప్పటివరకూ పలువురు నటుల గోళ్లు.. వెంట్రుకలను సిట్ అధికారులు తీసుకున్నారన్న వర్మ.. ఛార్మీ గోళ్లు తీయలేదని.. మానిక్యూర్ చేసినట్లుగా ఉందన్నారు. సిట్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఛార్మీని చూస్తే.. ఝూన్సీ లక్ష్మీభాయిని మించిన ధైర్యసాహసాలు కనిపించినట్లుగా పేర్కొన్నారు. ఛార్మీ బయటకు వచ్చిన తీరు చూస్తుంటే.. సిట్ అధికారులనే ఆమె ప్రశ్నించినట్లుగా కనిపిస్తోందన్నారు. సిట్ విచారణను పూర్తి చేసుకొని వచ్చిన ఛార్మీ ముఖంలో ఆనందం చూస్తే అలానే అనిపిస్తుందంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.