పూరి జగన్నాథ్ ఓ సినిమా తీస్తే.. దాని గురించి ఆయన, మిగతా యూనిట్ సభ్యులు అందరూ కలిసి చేసే ప్రమోషనంతా ఒకెత్తు. పూరి గురువు రామ్ గోపాల్ వర్మ చేసే పబ్లిసిటీ అంతా ఒకెత్తు. టెంపర్ - జ్యోతిలక్ష్మి సినిమాల్ని వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎలా ప్రమోట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పూరి కొత్త సినిమా ‘లోఫర్’కు కూడా తనదైన శైలిలో పబ్లిసిటీ కల్పిస్తున్నాడు వర్మ.
లోఫర్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి వర్మ చాలా ఎగ్జైట్ అయిపోతూ ఓ చిత్రమైన కామెంట్ చేశాడు. ఈ సినిమా మణిరత్నం, పూరి ల క్రాస్ బ్రీడ్ లాగా అనిపిస్తోందని చెప్పాడు వర్మ. ‘లోఫర్’ పోస్టర్లు చూస్తుంటే పూరి సూపర్ ఫామ్ లో ఉన్నట్లుగా అనిపిస్తోందని కూడా వర్మ కామెంట్ చేశాడు. వరుణ్ తేజ్ లుక్ అదిరిపోయిందని.. బ్యాగ్రౌండ్ లో త్రిశూలం పెట్టడం చాలా బాగుందని.. పూరి సినిమాలో రేవతి లాంటి మంచి నటిని చూడటం తనకు సర్ ప్రైజ్ అని వర్మ చెప్పాడు.
పూరి సినిమాలకు సంబంధించి వర్మ ఏదో క్యాజువల్ గా కామెంట్లు పెట్టినట్టే ఉంటుంది కానీ.. ఇదంతా గురు శిష్యుల ప్రమోషనల్ స్ట్రాటజీలో భాగమే. టెంపర్ - జ్యోతిలక్ష్మి సీనిమాల విషయంలో వర్మ పబ్లిసిటీ బాగానే ఉపయోగపడింది. ఐతే రొటీన్ పూరి మార్కు సినిమాలా కనిపిస్తున్న ‘లోఫర్’ ను మణిరత్నం సినిమాతో పోల్చడమే కొంచెం చిత్రంగా అనిపిస్తోంది.