ఏ ముహూర్తంలో మొదలుపెట్టాడో కానీ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు బాలకృష తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు ప్లాప్ కావడం కలిసి వస్తోంది. దీన్నే తనకు సానుకూలాంశంగా వాడుకుంటున్నాడు వర్మ. చాలా బోరింగ్ గా ఉండే ఎన్టీఆర్ జీవితాన్ని సరిగా చూపలేదని ఉండాల్సిన డ్రామా కానీ విలన్ కానీ ఎవరు లేక చప్పగా తీయడంతో పరాజయం పాలైందని తేల్చి చెప్పాడు. అంతే కాదు తన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మాత్రం అన్ని నిజాలే ఉంటాయని ముఖ్యంగా ఆయన కాలం చేయడానికి ముందు జరిగిన సంఘటనలు ఉత్కంఠ రేపెలా ఉంటాయని అవన్నీ చూపిస్తా అంటున్నాడు.
ముఖ్యంగా జనంతో పాటు రాజకీయ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేపే వైస్రాయ్ ఎపిసోడ్ ఉంటుందని ముందే చెప్పేసాడు కాబట్టి ఈ సారి చేతలు గట్టిగానే ఉంటాయని అభిమానులు నమ్ముతున్నారు. అయితే కథకు సంబంధించి మరో క్లూ కూడా ఇచ్చాడు వర్మ. తన స్టోరీ ఎన్టీఆర్ కు లక్ష్మి పార్వతితో వివాహం అయ్యాక ఉంటుందని తర్వాత ఆయన జీవితంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలు నడిచిన డ్రామా మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తానని హామీ ఇచ్చేసాడు.
అంటే వెన్నుపోటు ఎపిసోడ్ ఉన్నట్టు క్లారిటీ ఇచ్చినట్టే. చివరి రోజుల్లో చాలా విషాదాలు జరిగాయని అవన్నీ ఇందులో ఉంటాయని చెబుతున్నాడు. సో మహానాయకుడు రిలీజ్ డేట్ సందిగ్ధంలో ఉన్న వేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ వర్మ ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనే దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు