వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్వర్మ.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు గురించి ఓ ట్వీట్ చేశాడు. తమిళనాడు జయలలిత బయోపిక్ ‘తలైవి’లో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ను చూసిన వర్మ తనదైన రీతిలో స్పందించారు.
తలైవి ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోందని, ఈ ట్రైలర్ ను జయలలిత స్వర్గం నుంచి చూసి థ్రిల్ అయి ఉంటుందని రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. ఈ ట్రైలర్ లో కంగనా సూపర్ స్పెషల్ గా ఉందంటూ కామెంట్ చేశాడు. అయితే.. కొన్ని విషయాల్లో కంగనా పరిధి దాటి వెళ్లపోతోందని, వాటితో తాను ఏకీభవించనంటూ రాశాడు.
అయితే.. కంగనా పరిధి దాటిన అంశాలేవీ అన్నది మాత్రం వర్మ వెల్లడించలేదు. రైతులను ఉగ్రవాదులు అనడం, గాంధీ పురుషాధిక్యంతోనే గొప్ప నాయకుడయ్యాడనీ.. చాలా అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా. మరి, వర్మ ట్వీట్ ఈ విషయాలకు సంబంధించినదేనా? లేదంటే.. మర్మం వేరే ఏదైనా ఉందా? అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
కాగా.. వర్మ ట్వీట్ కు అదే రీతిలో రిప్లీ ఇచ్చింది కంగనా. తాను మాత్రం వర్మతో ఏ విషయంలోనూ ఏకీభవించకపోవడం అనేది ఉండదని చెప్పింది. ఆయనంతే తనకు ఇష్టమని, చాలా విషయాల్లో అభినందినస్తానని కూడా రాసుకొచ్చింది.
ఇగో ప్రపంచంలో వర్మ హర్టు కాడన్న కంగనా.. ఆయన ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోడని, తనను కూడా తాను తీసుకోడని రిప్లే ఇచ్చింది. తనకు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ముగించింది. మొత్తానికి.. వర్మ నర్మగర్భ వ్యాఖ్యలకు కంగనా కూడా అదేవిధంగా స్పందించడంతో.. ఎవరికి కావాల్సిన అర్థాలు వారు వెతుక్కుంటున్నారు.