శ్రీదేవి అన్ని కష్టాలు పడిందా?

Update: 2018-02-27 09:23 GMT
సినిమా వాళ్లకేంటి.. కోట్లకు కోట్లు పారితోషకాలు.. లగ్జీరియస్ లైఫ్ అనుకుంటాం కానీ.. అందరి జీవితాలూ జనాలు అనుకున్నంత సాఫీగా ఏమీ సాగవు. ఇందుకు శ్రీదేవి జీవితమే ఉదాహరణ అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. శ్రీదేవి జీవితంలోని మరో కోణం గురించి వర్మ వివరిస్తూ ఈ రోజు ఒక సుదీర్ఘ లేఖను తన లాంటి అభిమానుల కోసం విడుదల చేశాడు వర్మ. అందులో వర్మ చెప్పిన కొన్ని విషయాలు షాకింగ్ అనిపించేవే.

ఐదేళ్ల వయసు నుంచే సినీ రంగంలో కొనసాగుతున్న శ్రీదేవి.. గాజు గోడల మధ్యే జీవించిందని.. ఆమె చాలా సున్నిత మనస్కురాలని.. ఆమె జీవితంలో ఏ రోజూ ప్రశాంతత అనేదే లేదని వర్మ తెలిపాడు. శ్రీదేవి తండ్రి చనిపోయాక వాళ్ల కుటుంబంలో అలజడి రేగిందని.. శ్రీదేవి తల్లికి సరైన అవగాహన లేక ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి మోసపోయిందని.. తర్వాత మరో సందర్భంలో శ్రీదేవి సోదరి శ్రీలతకు ఆస్తులన్నింటినీ రాసిచ్చేసిందని.. దీంతో శ్రీదేవి ఒక దశలో చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకుందని వర్మ తెలిపాడు.

బోనీ కపూర్ నిండా అప్పుల్లో మునిగిన స్థితిలో శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడని.. పెళ్లి తర్వాత కూడా శ్రీదేవి ఏమంత సంతోషంగా లేదని.. మోనా నుంచి బోనీని విడగొట్టిందన్న కారణంతో బోనీ తల్లి శ్రీదేవిపై చేయి కూడా చేసుకుందని వర్మ వెల్లడించాడు. అందం కాపాడుకోవడం కోసం శ్రీదేవి కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుందని.. దాని ప్రభావం గత ఐదారేళ్లలో శ్రీదేవిని చూసిన వాళ్లకు స్పష్టంగా తెలుస్తుందని.. గత కొన్నేళ్లుగా శ్రీదేవి తన కూతుళ్ల కెరీర్ గురించి ఆలోచిస్తూ గడిపిందని.. మొత్తంగా శ్రీదేవి తన జీవితాంతం అశాంతి మధ్యనే బతికిందని.. చనిపోయాక అయినా ఆమెకు శాంతి లభిస్తుందేమో అన్నది తన ఆశ అని వర్మ అన్నాడు.
Tags:    

Similar News